30 ఇయర్స్ ఇండస్ట్రీకి పృథ్వీకి జ‌గ‌న్ బంపరాఫర్…

3263
CM YS Jagan's appoints Telugu actor Prudhvi Raj as SVBC Chariman
CM YS Jagan's appoints Telugu actor Prudhvi Raj as SVBC Chariman

సీనీయర్ కమెడియన్ , వైసీపీ నేత పృథ్వీకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అదిరపోయే ఆఫర్ ఇచ్చారు. ప్రముఖ కమెడియన్ నటుడు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. మొద‌టి నుంచి పార్టీకి విధేయుడుగా ఉంటూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా పాల్గొన్నారు. ఎన్నికల్లో వైసీపీ తరఫున పృథ్వీ ప్రచారం చేశారు. ఆ క్రమంలోనే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్‌.

జగన్ పై తనకున్న అభిమానాన్ని పృథ్వీ ఎప్పుడూ పలు వేదికలపై ప్రదర్శించారు. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో కూడా పలుమార్లు జగన్ తో పాటు పాల్గొన్నారు. జగన్ కు వీరవిధేయుడిగా నిరూపించుకున్నారు. చివరకు ఎన్నికల్లో మెగా బ్రదర్స్ ను కూడా ఎదుర్కొన్నారు. అనేక సార్లు పవన్, నాగబాబుపై విరుచుకుపడ్డారు కూడా. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఆవశ్యకతపై తన వాణిని గట్టిగా వినిపించి అథిష్టానం, జగన్ దృష్టిలో పడ్డారు. జగన్ ప్రభుత్వం రానే వచ్చింది.

పార్టీకోసం క‌ష్ట‌ప‌డిన వారికి జ‌గ‌న్ ఎంత‌టి స‌ముచిత స్థానం క‌ల్పిస్తారో న‌టుడు పృథ్వీ విష‌యంలోనె తెలిసింది. శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వీని సీఎం జగన్ నియమించబోతున్నట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలో అధికారిక ఉత్తర్వులు కూడా వెలువరించనుంది.

మరోవైపు ఇంతవరకు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా ఉన్న టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏడాదిన్నర తర్వాత తన పదవికి రాఘవేంద్రరావు రాజీనామా సమర్పించారు. వయోభారం కారణంగానే ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో రాఘవేంద్రరావు పేర్కొన్నారు.దాదాపు ఏడాదిన్నరపాటు రాఘవేంద్రరావు ఆ పదవిలో కొనసాగారు.

Loading...