ప్రత్యేక కోస్తా ఆంధ్ర ఉద్యమానికి కమ్మ లాబీ రెడీ?

1311
Coastal Andhra Movement Over AP 3 Capitals Issue
Coastal Andhra Movement Over AP 3 Capitals Issue

ఏపీ పరిపాలన రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించే ప్రక్రియ కమ్మ కమ్యూనిటీ నాయకులలోని ఒక వర్గాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందట.. ఇప్పటికే బాబు మాటలు నమ్మి అమరావతిలో భారీగా భూములు కొని, పెట్టుబడులు పెట్టిన వారంతా జగన్ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. వీరి నిరాశ, నిస్పృహ ఎంత వరకూ వెళుతోందంటే ఇప్పుడు ఏపీ కోస్తా ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలనే డిమాండ్ వరకూ తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే విశాఖపట్నం రాజధానిగా కమ్మ బెల్ట్ మొత్తం వ్యతిరేకిస్తోంది. వారు కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనే రాజధాని ఉండాలని కోరుతున్నారు. ఇప్పుడు జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో కోస్తా తీరాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకొస్తున్నారట..

ఇప్పటికే అమరావతిలో పెట్టుబడులు పెట్టిన ఎన్ఆర్ఐ సతీష్ చాగంటి తాజాగా సోషల్ మీడియాలో హాట్ కామెంట్స్ చేశారు. ఇది ఇప్పుడు వైరల్ గా మారింది. అమరావతి, దానిపక్కనే కృష్ణ నదిని బేస్ చేసుకొని ఎన్నో పర్యాటక ప్రాజెక్టులు, పరిశ్రమలు ముందుకొచ్చాయని.. స్వయంగా కోస్టా మెరీనా ప్రాజెక్టును తాము చేపట్టామని ఇప్పుడు అమరావతి మారితే ప్రాజెక్టులన్నీ ఆగిపోతాయని ఆయన ట్వీట్ చేశారు. దీన్ని బట్టి తమకు ప్రత్యేక కోస్తా ఆంధ్రా రాష్ట్రం కావాలని కోరుకుంటున్నానని డిమాండ్ చేశారు. కమ్మ సామాజికవర్గ మంతా సపోర్టుగా నిలుస్తుందన్నారు.చంద్రబాబు, బీజేపీ, పవన్ ఎవరు మద్దిస్తే వారివెంట నడుస్తామన్నారు.

దీన్ని బట్టి కమ్మ లాబీ అంతా రాజధాని మార్చితే ప్రత్యేక రాష్ట్రం ప్రతిపాదనను తెరపైకి తేవడానికి రంగం సిద్ధం చేస్తోందన్న అనుమానాలు బలపడుతున్నాయి.

Loading...