Friday, April 26, 2024
- Advertisement -

నిజం ఒప్పకుంటే చేసిన తప్పుడు పని ఒప్పు అవుతుందా….

- Advertisement -

అధిరానంలో ఉన్నప్పుడు ఎలాంటి యెదవ పనులు చేసినా వాటన్నింటిని అధికారులు చూసిచూడనట్లు వదిలేస్తుంటారు. అదే అధికారం కోల్పోతె అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడ ఏపీలో కూడా అలాంట చర్చే నడుస్తోంది. టీడీపీ అధికారంలో హైదారాబాద్ నుంచి అసెంబ్లీకి సంబంధించిన ఫర్నీచర్ తరలిస్తున్న సమయంలో దాంట్లో కొంత అప్పటి స్పీకర్ కోడెల తన ఇంటిచి చేర్చుకన్నారు. అధికారం పోవడంతో ఇప్పుడు అది బయటకు వచ్చింది. అది కాస్త మీడియాలో వైరల్ కావడంతో ఎట్టకేలకు స్పందించారు కోడెల.

హైదరాబాద్ నుండి అసెంబ్లీ ఫర్నిచర్ ను తరలిస్తుండగా సామాన్లు సర్దుబాటు చేసుకునే క్రమంలో కొంత ఫర్నిచర్‌ను తాను వినియోగించుకున్నట్లు తప్పు కొప్పుకున్నారు. గతంలో అనేక సార్లు అసెంబ్లీ అధికారులకు లిఖిత పూర్వక లేఖలు రాశానని అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పుడు అధికారులు వచ్చి ఫర్నీచర్ తీసుకెల్లవచ్చని లేకపోతె వాటి ఖరీదు ఎంతో చెబితే మొత్తం చెల్లిస్తానని తెలిపారు. ఎవరైనా నవ్వి పోతారని కూడా అనుకోకుండా వ్యాఖ్యలు చేయడం గమనార్హం

స్పీక్ లాంటి బాధ్యాతా యుతమైన పదవిలో ఉండి ప్రభుత్వం ఆస్తులను కాపాడాల్సిన స్పీకరే ఇలాంటి పనులు చేయడం నిజంగా అసహ్యం కలిగించక మానదు. అధికారంలో ఉన్నప్పుడు దీనిపై ఒక మాట కూడా మాట్లాడని కోడెల తన తప్ప బయటపడటంతో నిజం ఒప్పుకున్నారు. తప్పు ఒప్పుకున్నంత మాత్రాన మచ్చ పోదుగా.మొత్తానికి దొరికిన తర్వాత.. కరడు కట్టిన దొంగ కూడా తానే పాపం ఎరుగనని ఇలానే అంటారు. మరి వారిని వదిలేస్తారా? కొత్త స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -