Friday, April 26, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. వీరేనా?

- Advertisement -

ఏపీకి నూతన సీఎంగా జగన్ వచ్చాక పరిస్తితులు మారాయా? కేసీఆర్, జగన్ దోస్తీతో ఇక నరసింహన్ శకం ముగిసినట్టేనా.? అంతకుముందు చంద్రబాబు, కేసీఆర్ లు ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలకు కారణమై విభజన సమస్యలపై కయ్యానికి కాలుదువ్వారు. కానీ ఇప్పుడు కేసీఆర్ , జగన్ లు కలిసి నడుస్తున్నారు. అందుకే ఇక పదేళ్లకు పైగా గవర్నర్ గా ఉన్న నరసింహన్ పని లేదని కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

నరసింహన్ స్థానంలో ఏపీ ,తెలంగాణలకు విడివిడిగా ఇద్దరు గవర్నర్లను నియమించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కేంద్రంలో మంత్రి పదవి దక్కని సుష్మా స్వరాజ్ తోపాటు, మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ లను గవర్నర్ గా పంపాలని మోడీ ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలిసింది.

ఇక మరోసారి పునరుద్ధరణ కష్టమని తెలియడంతో గవర్నర్ నరసింహన్ ఢిల్లీ బాటపట్టినట్టు తెలిసింది. తాజాగా హోంమంత్రి అమిత్ షాతో నరసింహన్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

ఇప్పటికే కాంగ్రెస్ హయాంలో గవర్నర్లుగా చేసిన వారందరినీ మార్చిన బీజేపీ ప్రభుత్వం తెలుగురాష్ట్రాల మధ్య విభజన సమస్యల కారణంగా అన్నీ తెలిసిన నరసింహన్ ను మార్చలేదు. అయితే ఇప్పుడు తెలుగురాష్ట్రాల సీఎంల మధ్య మంచి సయోధ్య ఉండడంతో నరసింహన్ ను తొలగించి బీజేపీ నేతలకు గవర్నర్ పోస్టు ఇచ్చేందుకు కేంద్రం రెడీ అయినట్టు కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -