Friday, April 26, 2024
- Advertisement -

హైదరాబాద్ కాదు జలాబాద్.. వందేళ్ళలో ఇది రెండో సారి..?

- Advertisement -

మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానల వల్ల జనజీవనం స్తంభించిపోయింది చెప్పాలి.. హైదరాబాద్ లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి.. లోతట్టు ప్రాంతాలు జలమయమై అక్కడి వాసులని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. నగరంలో ఎప్పుడు లేనంతగా వర్షపాతం నిన్న నమోదు కాగా  గరిష్టంగా 32 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది.  గత వందేళ్లలో ఇంత శాతం వర్షపాతం నమోదు కావడం రెండో సారి కాగా ఈ వర్షం దెబ్బకు శివారు ప్రాంతాలలో ని ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు..

ఇక వర్షం వల్ల నగరంలో పలు చోట్ల తొమ్మిది మంది చనిపోగా మంత్రి తలసాని శ్రీనివాస్ దీనిపై ఎమర్జెన్సీ ని ప్రకటించి టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రవేశ పెట్టారు.. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేయాలనీ వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై సహాయక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.. ఇక భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఏవిధంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు సైతం చేపట్టింది..

చెట్లు, కటౌట్లు, హోర్డింగ్ ల కింద ఎవరూ నిలబడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రాణాలు విలువైనవి ఇలాంటి సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పగా పలు సూచనలు కూడా ప్రభుత్వం ఇచ్చింది.. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఎమర్జెన్సీ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అనుబంధ పరిశ్రమలకు తీవ్ర ఆటంకం కలుగగా  నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వృక్షాలు కూలిపోయాయి.రవాణా వ్యవస్థ కి ఇబ్బంది కాగా మరికొన్ని గంటలు ప్రజలు అవసరమైతే నే బయటకు రావాలని లేదంటే ఇంట్లోనే ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -