Friday, April 26, 2024
- Advertisement -

73వ స్వాతంత్య్ర దినోత్సవరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ..

- Advertisement -

జమ్మూ,కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 ని రద్దు చేసిన తర్వాత మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా.. ఎర్రకోటలో ప్రధాని మోదీ రక్షణశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

త్రివిధ దళాల సమన్వయం కోసం ఒక చీఫ్‌ (సీడీఎస్‌)ను నియమించబోతున్నట్లు ప్రకటించారు ప్రధాని మోదీ . సైనిక విభాగాల మధ్య సమన్వయానం కోసం.. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌)గా వ్యవహరిస్తారన్నారు. రక్షణ రంగంలో ఇదే కీలకమైన సంస్కరణ (మార్పు)గా చెబుతున్నారు నిపుణులు. ఇదో గొప్ప నిర్ణయమని.. రాబోయే రోజుల్లో మన త్రివిధ దళాలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయన్నారు. దేశ రక్షణ సాంకేతికతలో ఎన్నో మార్పులు వచ్చాయని.. కాబట్టి ఏదో ఒక సైనిక విభాగంపై ఆధారపడడం సరికాదని.. త్రివిధ దళాలను సమన్వయ పరుచుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం త్రివిధ దళాలకు రాష్ట్రపతి అధిపతిగా కొనసాగుతున్నారు. ఈ రోజుల్లో రాష్ట్రపతికి చాలా పనులు ఉంటున్నాయి. ఎన్నో సందర్భాల్లో ఆయన్ని ఎన్నో కార్యక్రమాలకు ఎంతో మంది పిలుస్తుంటారు. మరో వైపు త్రివిధ దళాలపై పూర్తి అవగాహన ఉండకపోవచ్చు.

ఇలాంటి నేపధ్యంలో త్యేకించి ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించగల, పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిని ప్రత్యేక పోస్టులో నియమిస్తే… సదరు వ్యక్తి పూర్తి త్రివిధ దళాల్ని ఏకతాటిపై నడిపిస్తూ… పూర్తిగా దృష్టి పెట్టే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రత్యేకించి ఈ పోస్టును మోదీ సృష్టిస్తున్నట్లు సమాచారం.

రాష్ట్రపతి, ప్రధానీ, రక్షణ మంత్రి వేర్వేరు పనుల్లో బిజీగా ఉన్నా… దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చూసేందుకు కొత్త అధికారికి వీలవుతుంది. అందుకే ప్రధాని మోదీ ఈ కొత్త పదవిని క్రియేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -