Saturday, April 27, 2024
- Advertisement -

చిదంబరంపై లుక్ ఔట్ నోటీసులు….అరెస్ట్ కు రంగం సిద్ధం

- Advertisement -

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అరెస్ట్ సీబీఐ అధికారులు రంగం సిద్దం చేశారు. ఢిల్లీ హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయనకు.. అక్కడ కూడా తీవ్ర నిరాశె ఎదురయ్యింది. ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు బెంచ్‌ నిరాకరించింది. మరోవైపు చిదంబరానికి బెయిల్‌ ఇవ్వద్దని సీబీఐ న్యాయస్థానాన్ని కోరింది.

మణిలాండరింగ్ తో ముడిపడి ఉన్నందున ఢిల్లీ హైకోర్టు తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వలేమని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి రమణ మాట్లాడుతూ.. ఈ కేసును చీఫ్ జస్టిస్ ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. మధ్యాహ్నం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఈ పిటిషన్‌ను విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీజే తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

అయితే చిదంబరంకు అరెస్ట్ నుంచి రిలీఫ్ దక్కడం ఇక అనుమానంగానే కనిపిస్తోంది. ఇప్పటికైతే చిదంబరం ఆచూకీ ఇంకా తెలియరాలేదు.మంగళవారం రాత్రి సీబీఐ అధికారులు ఆయన ఇంటికి వెళ్లినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన ఆచూకీ తెలియరాలేదు. ఆయన పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు చిదంబరంపై సీబీఐ లుక్‌అవుట్‌ నోటీసులను జారీచేసింది. దేశం విడిచి పోకుండా ఉండాలని సీబీఐ ఆదేశించింది. దీంతో చిదంబరం అరెస్ట్‌కు అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -