Friday, April 26, 2024
- Advertisement -

మరి పవన్ కల్యాణ్ సాధించిన ఘనతలు ఏమనగా….

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కు ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ (ఐఈబీఎఫ్‌) ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు పవన్ ఎంపికయ్యార‌ని అయ‌న అభిమానులు భ‌జాయించి ఢంకా మోగిస్తున్నారు. అస‌లు ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు ఏంసాధించారో అంత గొప్ప‌గా చెప్పుకొనేదానికి నీళ్లు నమలాల్సిన పరిస్థితి.

ప్ర‌శ్నిచండానికే పార్టీ అని ప్ర‌క‌టించిన ఆయ‌న ఏమేర‌కు ప్ర‌శ్నిస్తున్నాడో అంద‌రికి తెలియ‌ని విషంకాదు . స‌భ‌ల్లో,ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో హోరెత్తిపోయేలా అరిచి ప్రసంగించిన పీకే ఏస‌మ‌స్య‌ల‌మీద ప్ర‌శ్నించారుప్ర‌భుత్వాన్ని. మామూలుగా సినిమా వాళ్లు రిలీజ్ కు ముందు ఊరిస్తూ మాట్లాడటం, సినిమా రిలీజ్ తర్వాత ఊసురుమనిపించడం మామూలే. ప్ర‌భుత్వానికి ఇబ్బందులేకుండా ఉండే స‌మ‌స్య‌ల‌ను ప‌రిస్క‌రించ‌డంమిన‌హా ఏమిలేవు.

సినిమా నేపథ్యం నుంచి వచ్చిన పవన్ కల్యాణ్ రాజకీయంలో కూడా సినిమా తీరునే వ్యవహరిస్తూ ఉన్నాడు. చెప్పిన మాట నిలబెట్టుకోవడం, కొంత సేపు నాకు శక్తి లేదు.. అని అనడం, మరి కాసేపు ఇంకోటేదో చెప్పడం… ఇలా మూడున్నర సంవత్సరంగా పవన్ ప్రస్థానం సాగుతోంది. పవన్ కల్యాణ్ సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ రాణిస్తున్నందుకు గానూ ఒక అంతర్జాతీయ పురస్కారం వరిస్తోందట.

ప‌వ‌న్ సాధించిన ఘ‌న‌త‌లు చూసుకుంటె ఉద్దానం కిడ్నీబాధిత స‌మ‌స్య‌ల‌పై గ‌ళం విప్పుతానె స‌మ‌స్య ప‌రిస్కారం అయ్యిందా..? కాట‌మ‌రాయుడు సినిమాప్ర‌మోష‌న్‌లో చేనేత‌కు అంబాషిడ‌ర్‌గా ప్ర‌క‌టించ‌డం,ఇంకా వివిధ సామాజిక సమస్యల మీద పోరాటం వీటికి గాణు ప‌వ‌న్‌కు అవార్డును ఇచ్చేస్తున్నారంట‌.

ఈ అవార్డును ఇండో యూరోపియన్‌ బిజినెస్‌ ఫోరమ్‌ అనే సంస్థ ఇస్తోందట. దీనికి ఎక్సలెన్స్ అవార్డు అని అంటారటమొత్తానికి పవన్ తన రాజకీయం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఎన్నికల వైపు వెళ్లకపోయినా.. అవార్డులు మాత్రం బాగానే వస్తున్నట్టుగా ఉన్నాయ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -