Friday, April 26, 2024
- Advertisement -

మోడీషాలకు జార్ఖండ్ షాక్.. బీజేపీ చేజారుతున్న రాష్ట్రాలు

- Advertisement -

దేశంలో అఖండమెజార్టీతో గద్దెనెక్కి సమరోత్సాహంతో చెలరేగిపోతున్న మోడీషాల ముందరి కాళ్లకు ప్రజలు బంధం వేస్తున్నారు. వరుసగా రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తూ ప్రతీకారం తీర్చుకుంటున్నారు..

మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పొత్తుల సంసారంతో చిత్తయిన బీజేపీ.. ఇప్పుడు జార్ఖండ్ లోనూ అదే పొత్తుల యావ్వారంతో వెనుకబడింది.కాంగ్రెస్+జేఎంఎం కూటమి జార్ఖండ్ లో ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. బీజేపీ వెనుకబడింది.

మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో మేజిక్ మార్క్ 42. కాంగ్రెస్+జేఎంఎం కూటమి 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేవీఎం 4, ఏజేఎస్యూ 2 స్థానాల్లో, ఇండిపెండెంట్స్ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఈ నలుగురు కలిసినా బీజేపీ బలం 40 స్థానాల్లో మాత్రమే ఉంటుంది. దీంతో కాంగ్రెస్ కే అధికారం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ లను కోల్పోయిన బీజేపీ.. ఎన్నికల తర్వాత మహారాష్ట్రలోనూ పొత్తులతో చిత్తైంది. ఇప్పుడు జార్ఖండ్ లోనూ ఓటమి దిశగా సాగుతోంది. ఇక కాంగ్రెస్ మాత్రం సొంతంగా గెలవలేక స్థానిక పార్టీలతో కలిసి బీజేపీని ఓడిస్తూ బలపడుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -