Friday, April 26, 2024
- Advertisement -

క‌ర్నాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం….25 మంది జ‌ల‌స‌మాధి

- Advertisement -

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ ప్రయివేట్‌ బస్సు అదుపుతప్పి కావేరి నది వీసీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 25 మంది చనిపోగా… మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు సుమారు 205 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.

మాండ్య నుంచి పాండవపుర వెళ్తున్న ఈ బస్సు కనగణమరడి గ్రామంలో అదుపుతప్పి కావేరీ నది కాలువలోకి దూసుకెళ్లిందన్నారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు ఉన్నారని, కాలువలో బస్సు పూర్తిగా మునిగిపోయిందని తెలిపారు. దీంతోనే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు వెల్లడించారు. చ‌నిపోయిన వారిలో దాదాపు 20 మంది స్కూల్ పిల్లు ఉండ‌టం గ‌మ‌న‌ర్హం.

కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది. కాలువలోని దూసుకెళ్లగానే బస్సు మొత్తం నీటిలో మునిగిపోయింది. దాంతో బయటికి రాలేక కొందరు, ఈత రాక మరికొందరు చిన్నారులు చనిపోయారు. స్థానికులు కొందరు పిల్లలను కాపాడి ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిర్లక్ష్యమే బస్సు అదుపుతప్పడానికి కారణమైనమని ప్రత్యేక్ష సాక్ష్యులు చెబుతున్నారు. అతి వేగంగా బస్సును నడిపిన డ్రైవర్, మూల మలుపు దగ్గర కూడా వేగం తగ్గించకపోవడం… అదే సమయంలో ఎదురుగా వేరే వాహనం రావడంతో అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -