Friday, April 26, 2024
- Advertisement -

పరవళ్లు తొక్కుతన్న కృష్ణా ….నాగార్జున సాగర్‌లో 26 గేట్లు ఎత్తివేత

- Advertisement -

ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణానది పవరళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు పోటెత్తడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర 26 గేట్లను ఎత్తివేశారు అధికారులు. ఆదివారం శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్‌లోకి వదిలారు. నిన్నటి నుంచి భారీ ప్రవాహం సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది.

ప్రస్తుతం నాగార్జునసాగర్‌లోకి 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.. నీటిని దిగువకు విడుదల చేస్తూ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా భారీగా నీరు వచ్చి చేరుతోంది… ప్రస్తుతం 8.63 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 8.50 లక్షల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు.

నాగార్జునసాగర్‌కు జలకళ సంతరించుకోవడంతో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మాచర్ల వైపు నుంచి సాగర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతున్నారు. బక్రీద్‌ సెలవుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -