Saturday, April 27, 2024
- Advertisement -

భార్య మీద వస్తున్న ట్రాల్స్ పై స్పందించిన రాహుల్

- Advertisement -

సింగర్ చిన్మయి సినిమా పరిశ్రమ లో ఆడవాళ్ళకి సంబందించిన విషయాల పై మాట్లాడేందుకు ఎప్పుడు ముందు ఉంటుంది. సినిమాల్లో ఆడవాళ్ళని తక్కువ చేసి చూపించడం, లేదా ఆడవాళ్ళూ కేవలం ఇలాంటి పాత్రలకే పరిమితం అని చూపించే మెంటాలిటీ కి ఆమె వ్యతిరేకం. ఇటీవల ఆమె ట్విట్టర్ లో హీరోలు తమ వయసు లో సగం వయసు ఉన్న అమ్మాయిల తో రొమాన్స్ చేస్తున్నారు అనే కామెంట్ చేసింది. అయితే తన భర్త తీసిన మన్మధుడు 2 టీజర్ చూసాక, నాగార్జున కూడా తన వయసు లో సగం ఉన్న అమ్మాయిల తో, సినిమా లో రొమాన్స్ చేస్తున్నాడు, మరి తనెందుకు భర్త కి చెప్పలేదు అని చాల మంది ఆమెని ప్రశ్నిస్తున్నారు. కొందరు అయితే ఆమెని ట్రాల్ చేస్తున్నారు కూడా. ఈ విషయం పై తాజా గా రాహుల్ రవీంద్రన్ స్పందించాడు.

“నా భార్య ని ట్రయల్ చేస్తూ ఆమెని హిపోక్రైట్ అంటున్న మీ అందరికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? టీజర్ లో ముద్దులు ఉన్నాయి, లవ్ మేకింగ్ ఉంది. దానికి మహిళలని గౌరవించడానికి సంబంధం ఏంటి? నేను కానీ చిన్మయి కానీ సెక్స్ కి వ్యతిరేకం అని ఎప్పుడూ చెప్పలేదు. అసలు సెక్స్ గురించి మాట్లాడకుండా ఉండటం తప్పు. ఇప్పటికే మన సమాజం ప్రజలు 1.4 బిలియన్ టైమ్స్ సెక్స్ చేసారు. నేను పురుషాధిక్య రూపం లో ఆ సీన్లని ఇంకో లాగా,మీకు అలవాటైన లాగా షూట్ చేసి ఉంటె మీకు ప్రాబ్లమ్ ఉండేది కాదేమో. అందుకే శాంతించండి, ప్రేమించడం మొదలు పెట్టండి. ఇంకా ఏమైనా ఉంటె సినిమా చూసి మాట్లాడండి.” అని రాహుల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -