Saturday, April 27, 2024
- Advertisement -

ఆసియాలో గే వివాహాలను చట్టబద్ధం చేసిన మొద‌టి దేశం ఏదంటె..?

- Advertisement -

ఆసియాలోనె గే వివాహాలను చట్టబద్ధం చేసిన మొద‌టి దేశంగా తైవాన్ అవ‌త‌రించింది. గే వివాహాలను చట్టబద్ధం చేస్తూ ఆదేశ పార్ల‌మెంట్ బిల్లును ఆమోదించింది. పార్లమెంటు బయట వేలాది మంది హర్ష ధ్వానాలు వినిపిస్తుండగా..శుక్రవారం ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. దీంతో సామాన్య వివాహ చట్టంలో ఉండే అన్ని నిబంధనలు స్కలింగ సంపర్కులకు కూడా వర్తించనున్నాయి.ఇప్పటికే స్వలింగ వివాహాలపై ఆదేశంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ(డీపీపీ) ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం మే 24 నుంచి అమల్లోకి రానుంది.

డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. బిల్లుకు అనుకూలంగా మొత్తం 66 ఓట్లు రాగా వ్యతిరేకంగా 27 ఓట్లు వచ్చాయి. ఇక బిల్లు పాస్ చేసి కొత్త చరిత్ర సృష్టిస్తామని ప్రగతిశీల విలువలు ముందుగా తూర్పాసియా దేశాలనుంచే మొదలవుతాయని మరోసారి నిరూపిస్తామని అధ్యక్షురాలు త్సాయ్ ఓటింగ్‌ కంటే ముందు ట్విటర్‌లో పేర్కొన్నారు. ఎక్కడైనా సరే ప్రేమే గెలుస్తుందని ప్రపంచానికి చాటుతామని చెప్పారు.

డీపీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రెండేళ్ల క్రితం గే వివాహాల చట్టబద్ధతపై నిర్వహించిన రెఫరెండంలో భాగంగా.. అత్యధిక మంది దీనిని వ్యతిరేకించారని గుర్తు చేశాయి.ఈ చట్టం వల్ల తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా, గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఆమె ఈ చట్టం తీసుకువచ్చారు. దీందో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రో సారి ఆమె ఎన్నిక‌య్యే అవ‌కావాలు లేవ‌ని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -