Saturday, April 27, 2024
- Advertisement -

ఇక దూరమే.. కేసీఆర్, జగన్ నిర్ణయం

- Advertisement -

ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లు ఇప్పుడు కాసింత దూరం పాటించాలని యోచిస్తున్నట్టు సమాచారం. కనీసం రెండు నెలల పాటు కలవడాలు, సమావేశాలు నిర్వహించడాలు చేయకూడదని డిసైడ్ అయినట్టు తెలిసింది.

ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష చంద్రబాబు.. ఆయన అనుకూల మీడియా కేసీఆర్ తో జగన్ చెలిమిని బూచీగా చూపి ఏపీకి నష్టం జరుగుతోందని శోకనార్థాలు పెడుతున్న సంగతి తెలిసిందే. గోదావరి నీటి మళ్లింపు వివాదాన్ని పెద్దది చేసి లబ్ధి పొందాలని టీడీపీ భావిస్తోంది.

జగన్ ఏపీలో గెలిచాక నాలుగైదు సార్లు కేసీఆర్ తో భేటి అయ్యారు. తెలంగాణ, ఆంధ్రా మధ్య విభజన సమస్యల పరిష్కారంపై చర్చించారు. ఈ సందర్భంగానే గోదావరి నీటిని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు మళ్లించాలని కేసీఆర్ ప్రతిపాదించారు. దీనికి జగన్ కూడా సరేనని కేసీఆర్ ను బహిరంగంగా ప్రశంసించారు.

కానీ జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కేసీఆర్ తో ఒప్పందం చేసుకున్నాడని.. ఏపీ ప్రయోజనాల కోసం రాజీ పడుతున్నారని చంద్రబాబు, ఆయన మీడియా విష ప్రచారం మొదలు పెట్టింది. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గోదావరి నీటి మళ్లింపు సమస్య ఏపీ అసెంబ్లీని కుదిపేసింది. దీంతో ఇప్పుడే ఈ విషయంలో ముందడుడు వేస్తే చంద్రబాబు దీన్నొక ఆయుధంగా చేసుకుంటాడని.. భావించి కేసీఆర్-జగన్ లు ఇప్పుడే భేటి జరపకూడదని డిసైడ్ అయినట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -