Friday, April 26, 2024
- Advertisement -

తీవ్రవాదుల త‌రువాత టార్గెట్ మ‌న రాష్ట్రాలేనా..?

- Advertisement -

ముష్క‌రులు ఇటీవ‌లే శ్రీలంక‌లో భీబ‌త్సం సృష్టంచిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే. వ‌రుస బాంబు పేళ్లుల‌తో విధ్వంసం సృష్టించారు. ఈ ఘ‌ట‌న దాదాపు 300 మందికి పైగా త‌మ ప్రాణాలు కోల్పొయ్యారు. 700 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. తీవ్ర‌వాద‌ల దాడితో శ్రీలంక స‌ర్వ‌స్వం పొగొట్టుకుంది. ఇప్ప‌టికి కూడా ఆ దేశంలో బాంబులు ఎక్క‌డో ఓ చోట పేలుతూనే ఉన్నాయి. దీంతో ఆ దేశ ప్ర‌జ‌లు భ‌యం గుప్పిట్లో బ్ర‌త‌కాల్సి వ‌స్తోంది.

ఇది ఇలా ఉంటే తీవ్ర‌వాదులు త‌రువాత టార్గెట్ భార‌తేన‌ని చెబుతున్నాయి నిఘా వ‌ర్గాలు. అవును ముష్క‌రులు త‌రువాత బాంబుల‌నే పేల్చేది ఇండియాలోనేనని ఇండియా నిఘా సంస్థ ఒక‌టి ప్ర‌భుత్వ‌నికి ఓ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక‌లో ఇండియాలోని ప్ర‌ముఖ రాష్ట్రాలను తీవ్ర‌వాదులు టార్గెట్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, పాండిచ్ఛేరి, కేర‌ళ‌, గోవా, మ‌హారాష్ట్ర వంటి ప‌లు ప్ర‌దేశాల‌ను ముష్క‌రులు టార్గెట్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్ప‌టికే 19 మంది తీవ్ర‌వాదులు ,రామాంత‌పురం, త‌మిళ‌నాడు రాష్ట్రాంలో చొర‌బడ్డార‌ని నిఘ సంస్థ‌లు ప్ర‌క‌టించాయి.

దీంతో ఈ రాష్ట్రాలు చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హారించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఆయా రాష్ట్రాలకు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. అనుమానం వ‌చ్చిన వారిని అదుపులోకి తీసుకుని విచారించ‌వ‌చ్చాని కూడా నిఘా సంస్థ ఆదేశాలు జారీ చేసింది. తీవ్ర‌వాదులు ఇండియాలోకి చొర‌బ‌డిన విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త వ‌హిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన విష‌యం బ‌య‌టికిరావ‌డంతో ప్ర‌జ‌లు భ‌యానికి గురి అవుతున్నారు. ఏ నిమిషంలో ఏం జ‌రుగుతుందో అని ప్రాణాల‌ను గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -