టార్గెట్ రేవంత్ రెడ్డి.. కారణం ఆదేనా ?

రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన తరువాత నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం ఏర్పడింది. ముంఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా కూడా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వారే. వారిలో జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి వీరంతా కూడా ఉన్నారు. జగ్గారెడ్డి లాంటి వారు టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ప్రకటించడంపై బహిరంగంగానే అసహనాన్ని వ్యక్తపరిచారు. ఇక కాంగ్రెస్ కార్యవర్గంలోని ముఖ్య నేతలందరితోనూ రేవంత్ రెడ్డికి విభేదాలు ఉన్నాయనే సంగతి ఈ మద్య ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంతే స్థాయిలో రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిలో వ్యహరిస్తాడని.. పార్టీ కార్యాచరణకు సంభందించిన ఏ విషయాలను తమతో చర్చించడని, జైలుకు వెళ్లొచ్చిన వారి నేతృత్వంలో ఆత్మగౌరవాన్ని చంపుకొని తాను పని చేయలేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఇక రేవంత్ రెడ్డి వైఖరి పట్ల అసహనాన్ని వ్యక్తపరుస్తూ మరో సీనియర్ కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ కూడా ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారన్నే రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒక ప్రైవేట్ కంపెనీలా మార్చారని, రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ లో అరాచక పరిస్థితులు ఏర్పడ్డాయని, కేవలం రేవంత్ రెడ్డి వల్లే పార్టీ వీడుతున్నట్లు దాసోజు శ్రవణ్ చెప్పుకొచ్చారు.

ఇక కాంగ్రెస్ లోని మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రేవంత్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. తనను పార్టీ నుంచే వెళ్లగొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారని, ప్రాణం పోయిన తను కాంగ్రెస్ ను విడిచిపోనని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక వీళ్ళు మాత్రమే కాకుండా మరికొంత మంది నేతలు మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, గీత రెడ్డి ( మేదక్ ) వంటి వారు కూడా రేవంత్ వైఖరి పట్ల మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో మరికొంత మంది నాయకులు కూడా కాంగ్రెస్ ను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఇప్పటికే ఆపార్టీ నుంచి బయటకు వచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్ చెప్తున్నారు. దీంతో మరో ఏడాది లో ఎన్నికలకు సిద్దమౌతున్న తరుణంలో కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి కేంద్రంగా ఏర్పడ్డ ఈ అసమ్మతి తిరుగుబాటుపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read

కే‌సి‌ఆర్ కు గుబులు పుట్టిస్తున్న మునుగోడు ?

కాంగ్రెస్ కు షాక్ ఇస్తున్న కీలక నేతలు !

బండి సంజయ్ మైండ్ గేమ్..

Related Articles

Most Populer

Recent Posts