ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

237

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు జగన్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.దీనిపై టీడీపీ నేతలు మండిపడుతుండగా, వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా, ఆచితూచి మాట్లాడుతున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజధాని నిర్మాణం అన్నది రాష్ట్రానికి సంబంధించిన విషయమని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అసలు ఇది కేంద్రం పరిధిలోకే రాదని తేల్చిచెప్పారు.

Loading...