Saturday, April 27, 2024
- Advertisement -

చిదంబరాన్ని పట్టించిన హంతుకురాలు.?

- Advertisement -

ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చిందంటే ఇదే.. యూపీఏ హయాంలో ఆర్థిక మంత్రిగా, హోంమంత్రిగా అత్యున్నత బాధ్యతలు చేపట్టిన చిదంబరం తాజా అరెస్ట్ తర్వాత అసలు ఆయన ఏ కేసులో అరెస్ట్ అయ్యారు.. కారకులు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే చిదంబరం తాజాగా అరెస్ట్ అయ్యింది ఐఎన్ఎక్స్ మీడియా స్కాంలో.. ఈ మీడియా సంస్థను ప్రారంభించింది ఇంద్రాణి ముఖర్జీ అనే మహిళ. ఆమె రెండో భర్త పీటర్ ముఖర్జీ చిదంబరం కొడుకు కార్తికి వ్యాపార సలహాదారు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకొని ఈ మీడియా సంస్థను స్థాపించి ఇందులో 26శాతం వాటా అమ్మకానికి చిదంబరాన్ని అనుమతి కోరి విదేశాల్లోని చిదంబరం సంస్థలకు అక్రమంగా డబ్బులు తరలించారన్న అభియోగాలు ఉన్నాయి.

ఈ ఐఎన్ఎక్స్ కేసులోనే చైర్మన్ అయిన ఇంద్రాణి అప్రూవర్ గా మారి చిదంబరాన్ని ఇరికించారు. ఇంద్రాణి దాదాపు 200 కోట్ల ముడుపులు చిదంబరానికి చెందిన విదేశీ సంస్థలకు తరలించినట్టు సీబీఐ వర్గాలు గుర్తించాయి. ఈ వివరాలన్నింటిని ఇంద్రాణి అప్రూవర్ గా మారి చెప్పడంతో చిదంబరం ఇరుక్కుపోయారు.

అయితే ఇంద్రాణి అప్పట్లో తన కూతురు షీనా బోరా పేరిట భారీ మొత్తంలో సొమ్మును విదేశాల్లో దాచిపెట్టింది. అది బయటపడడంతో సొంత కూతురినే హత్య చేసి తన వరకు రాకుండా చూసుకుందానే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు కూడా ఆమెపై నడుస్తోంది. ఇలా చిదంబరం గుట్టు బయటపడడానికి కారణమైంది ఓ కేసులో హంతకురాలుగా ఉన్న ఇంద్రాణియే కావడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -