Friday, April 26, 2024
- Advertisement -

జగన్ కేబినెట్ లో ఆ 15మందికి చాన్స్

- Advertisement -

ఏపీ నూతన సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం పూర్తయ్యింది. ఇప్పుడు ఆయన కేబినెట్ లో చేరబోయే మంత్రులు ఎవరనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. తాజాగా సీఎం జగన్ జూన్ 8న కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారానికి అడుగులు వేస్తున్నారు. కేబినెట్ లో 15మందికి అవకాశం కల్పించాలని యోచిస్తున్నారని తెలిసింది.

జూన్ 11 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అందుకే 8న కేబినెట్ విస్తరణకు యోచిస్తున్నారు. ఇందులో 15మంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఎన్నికల వేళ వైఎస్ జగన్ కు అన్నీ తానై వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డిని జగన్ మంత్రివర్గంలోకి తీసుకుంటారనే చర్చ సాగుతోంది. ఆయనకు ఆర్థిక మంత్రి పదవి ఇచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెల్లే బాధ్యతను అప్పగిస్తారని అంటున్నారు.

ఇప్పటికే సీఎంవోను జగన్ ప్రక్షాళన చేశారు. కొన్ని గంట్లోనే చంద్రబాబు హయాంలో ఆయనకు వెన్నుదన్నుగా ఉన్న నాయకులను సమూలంగా మార్చేశారు. కీలకమైన డీజీపీ ఠాకూర్, ఏసీబీ డీజీ వెంకటేశ్వరరావును బదిలీ చేశారు. శనివారం లోగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సైతం స్థానం చలనం ఉంటుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -