Friday, April 26, 2024
- Advertisement -

రాజ‌స్థాన్ సీఎంగా సీనియ‌ర్‌కే జైకొట్టిన రాహుల్‌…

- Advertisement -

రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పార్టీ మట్టికరిపించి ఘ‌న‌విజ‌యం సాధించింది. గ‌త నాలుగు రోజులుగా రాజస్థాన్ సీఎంగా ఎవరు నియమితులు కానున్నారన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. సీనియ‌ర్ నేత‌ల‌కే రాహుల్ జైకొట్టారు.

మొత్తం 199 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 100 స్థానాల్లో గెలుపొంది అగ్రస్థానంలో నిలవగా, అధికార బీజేపీ 73 సీట్లతో పరాజయం పాలయింది. ఈ ఎన్నికల్లో ఇతరులు 26 స్థానాల్లో విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ సొంతంగా మెజారిటీ సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది.

పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లెట్‌ను ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన చేసింది. అటు సీఎం పదవి ఆశించిన యువనేత సచిన్ పైలట్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -