Saturday, April 27, 2024
- Advertisement -

వామ‌ప‌క్ష పార్టీల‌కు జ‌న‌సేన అంటే ఇంత చీపా…?

- Advertisement -

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయ‌డానికి ప‌వ‌న్ సిద్ద‌మ‌వుతున్నారు. ఎన్నిక‌లు ఎక్కువ దూరంలో లేవు కాబ‌ట్టి అభ్య‌ర్తుల ఎంపిక‌విష‌యంలో క‌స‌ర‌త్తు చేస్తున్నారు. కొద్దిరోజులుగా టీడీపీ తో గాని వైసీపీతో గాని జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటుంద‌న్న వార్త‌ల‌కు తెర‌దించారు జ‌న‌సేనుడు. వామ‌ప‌క్ష పార్టీల‌తో క‌ల‌సి పోటీ చేస్తామ‌ని ఎవ‌రితోనూ పొత్తు పెట్టుకోమ‌ని క్లారిటీ ఇచ్చారు.

ఇక సీట్ల స‌ర్దుబాటు విష‌యంలో కూడా జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు చ‌ర్చ‌లు జ‌రిపారు. పార్టీలో ముఖ్య‌నేత అయిన నాదెండ్ల మ‌నోహ‌ర్‌తో సీపీఐ, సీపీఎమ్ నేత‌లు చాలా సేపు చ‌ర్య‌లు జ‌రిపిన అనంత‌రం అంద‌రూ పవన్ ఇంటికి వెళ్లి వెల్లారు. విజ‌య‌వాడ‌లోని పార్టీ కార్యాలయం, పవన్ ఇంట్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు మొదలయ్యాయి.

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో వామ‌ప‌క్ష పార్టీల‌కు 60 సీట్లు కావాల‌నే ప్ర‌తిపాద‌న‌ను ప‌వ‌న్ ముందు పెట్టారంట‌. వామ‌ప‌క్షాల‌కు 60 సీట్లు కేటాయిస్తే జ‌న‌సేన 115 సీట్ల‌లో పోటీ చేయాలి. అస‌లు వామ‌ప‌క్షాల‌కు అంత సీనుందా అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. వామ ప‌క్షాలు అడిగిన‌న్ని సీట్లు ప‌వ‌న్ కేటాయించాల్సిన ప‌రిస్థితి. ఎందు కంటే వామ‌ప‌క్షాల‌తో క‌ల‌సి పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇక ఆమాట మీదె నిల‌బ‌డాల్సిన ప‌రిస్థితి.

గ‌తంలో వేరే పార్టీల‌తో పొత్తు పెట్టుకున్న వామ‌ప‌క్ష‌పార్టీలు ఇన్ని సీట్ల‌లో పోటీ చేసిన దాఖ‌లాలు లేవు. దీన్ని బ‌ట్టి చూస్తే ప‌వ‌న్ ను ఎంత త‌క్కువ అంచ‌నా వేస్తున్నారో అర్థ‌మ‌వుతోంది. మ‌రో వైపు రాష్ట్రంలోని అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో జ‌న‌సేన‌కు బ‌ల‌మైన క్యాడ‌ర్ కూడా లేదు కాబ‌ట్టి ప‌వ‌న్ ఒప్పుకొనే ప‌రిస్థితి రావ‌చ్చు. మ‌రో వైపు జ‌న‌సేన మీద ఎర్రన్నలకే మరీ బీభత్సమైన అంచనాలు లేవు . వామ ప‌క్ష‌పార్టీల ప్ర‌తిపాద‌న‌కు ప‌వ‌న్ ప‌చ్చ జెండా ఊపుతారా లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -