Friday, April 26, 2024
- Advertisement -

రంగంలోకి దిగిన‌ విజ‌య‌సాయిరెడ్డి..మాజీ మంత్రితో భేటీ

- Advertisement -

భాజాపాకు మ‌రో బిగ్ షాక్ త‌గ‌ల‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ వంటి కాపు నేతలు వైసీపీలో చేరగా, టీడీపీ నుంచి వైసీపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని తెలుస్తోంది.దశాబ్దాల తరబడి రాజకీయాల్లో కీలకంగా వ్య‌వ‌హ‌రించిన కేంద్ర మాజీ మంత్రి ఇప్పుడు వైసీపీవైపు చూస్తున్నారు. ప్ర‌స్తుతం భాజాపా ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో భాజాపా త‌రుపున పోటీ చేసే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో త‌న భ‌విష్య‌త్‌ను దృష్టిలో పెట్టుకొని పార్టీమారేందుకు సిద్ద‌మ‌య్యారు. వైసీపీ త‌రుపున విజ‌య‌సాయిరెడ్డి రంగంలోకి దిగిన‌ట్లు తెలుస్తోంది.ఆయ‌నే కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబ‌శివ‌రావు.

రాజ‌కీయాల్లో సీనియర్ పార్లమెంటిరియన్, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు ఆ పార్టీకి రాజీనామా చేయబోతున్న‌ట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోనే ఉన్న ఆయ‌న విభ‌జ‌న త‌ర్వాత అనుకోని ప‌రిస్థితుల్లో భాజాపాలో చేరాల్సి వ‌చ్చింది. కావూరి వైసీపీలో చేరడానికి దాదాపుగా నిర్ణయం తీసుకున్నారని టాక్. ఆయన రెండు మూడు రోజుల్లో జగన్ని కలసి తన అభిమతాన్ని చెబుతారని అంటున్నారు.

కావూరి వంటి సీనియర్ రాక వల్ల వైసీపీకి పశ్చిమ గోదావరి జిల్లాలో మరింతగా బలం పెరగబోతోంది. కావూరితో పాటు ఆయన అనుచర గణం కూడా పార్టీలోకి వస్తున్నట్లుగా చెబుతున్నారు. విజ‌య‌సాయి రంగంలోకి దిగి చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు సమాచారం. ఏలూరు లోక్ సభ స్థానాన్ని తనకు ఇవ్వాల్సిందిగా కావూరి కోరినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మరో 2-3 రోజుల్లో కావూరి వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి.

గ‌తంలో ఏలూరు నుంచే అనేక మార్లు గెలిచారు. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడిగా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఎంతో మంది శిష్య ప్రశిష్యులను కూడా తయారు చేసుకున్నారు. కావూరి లాంటి వారు పార్టీలోకి వ‌స్తే పార్టీ బ‌లం మ‌రింత పెరుగుతుంది. వైసీపీలో చేరుతున్నార‌న్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించ‌క‌పోవ‌డం చూస్తె….త్వ‌ర‌లో వైసీపీ కండువా క‌ప్పుకోవ‌డం మాత్రం ఖాయంగా క‌నిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -