Friday, April 26, 2024
- Advertisement -

గంటా ను చంద్రబాబు కూడా టార్గెట్ చేసినట్లు ఉన్నాడే..?

- Advertisement -

విశాఖ పట్నంలో కీలమైన వ్యక్తి గా ఎదిగిన రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాస్ రావు.. టీడీపీ లో ఈ లీడర్ ఎంతో ముఖ్యమైన వ్యక్తి కాగా, చంద్రబాబు కూడా కొన్ని నిర్ణయాలు గంటా అని అడిగి తీసుకుంటాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. అలాంటి గంటా శ్రీనివాస్ కొన్ని రోజులుగా పార్టీ వీడుతున్నాడనే వార్త ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా మారిపోయింది.. అయితే ఏ పార్టీ లోకి వెళ్తున్నాడనేది ఇంకా క్లారిటీ లేదు.. మొదట్లో వైసీపీ లోకి వెళ్తున్నాడన్న వార్తలు జోరుగా రాగ విశాఖ నేతలు అయన రాకను అడ్డుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి.. అయితే గంటా పార్టీ మారబోతున్నాడని వార్తలు వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా పార్టీ మారకపోవడం పై చాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ఇక కొన్ని రోజుల తర్వాత గంటా బీజేపీ లోకి వెళ్తున్నారని ప్రచారం జరిగింది.. ఇప్పటికే సుజనా వంటి కీలక టీడీపీ నేతలు బీజేపీ లోకి వెళ్లి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. వాళ్లలాగే తాను కూడాసెంట్రల్ లో అధికారంలో ఉన్న బీజేపీ లో చేరి చక్రం తిప్పుదామనుకున్న ఎందుకో అది కుదరట్లేదు. ఇక రాజకీయ వ్యూహాల్ని పక్కా గా వేయగల వ్యక్తిగా పేరున్న గంటా కొన్ని రోజులుగా వేస్తున్న వ్యూహాలు సరిగ్గా పనిచేయట్లేవని తెలుస్తుంది. అంతకుమించిన వ్యూహాలతో ప్రత్యర్థులు గంటా ని తీవ్ర ఇరకాటంలో పెడుతున్నారు.. చంద్రబాబు కూడా గంటా ని టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది..

గంటాతో పాటు విశాఖ పశ్చిమ‌ ఎమ్మెల్యే గణబాబు టీడీపీని వీడుతారని వార్తలు బాబు చెవిన పడడంతో అప్రమత్తం అయిన బాబు గణబాబుని రెండు జిల్లాల కో ఆర్డినేటర్ చేసి మరీ సైకిల్ దిగకుండా జాగ్రత్త పడ్డారు. ఇక మరో బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే అయిన పల్లా శ్రీనివాస్ ని విశాఖ ప్రెసిడెంట్ చేసి మరీ గంటా శ్రీనివాసరావు గూటి నుంచి వేరు చేశారు. ఈయన కూడా గంటాతో పాటే సైకిల్ దిగుతారు అని విపరీతమైన ప్రచారం అయితే ఈ మధ్యన సాగింది. కానీ గంటా కు పిలిచి ఏ పదవి ఇవ్వడకపోవడంతో గంటా పై చంద్రబాబు కు విముఖత రావడానికి కారణం ఏంటని గంటా సన్నిహితులు ఆలోచిస్తున్నారట..గంటా రాజకీయ జీవితంలో ఇపుడు సంక్లిష్టమైన రోజులు వచ్చాయా అని సందేహం మాత్రం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది..

కొత్త ఎత్తు వేయబోతున్న చంద్రబాబు.. ఈ దెబ్బ తో..?

చంద్రబాబుకు షాకిచ్చిన జగన్.. ఏం జరిగింది ?

పార్టీ లోనే బాబుకు వ్యతిరేక కూటమి తయరైందా..?

సాగునీటి ప్రాజెక్టులపై జగన్ నిరంతర పర్యవేక్షణ…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -