బీజేపీ లో కూడా పురంధరేశ్వరి ఇమడలేకపోతున్నారా..?

237
Daggubati Purandeswari Political Problems in BJP
Daggubati Purandeswari Political Problems in BJP

నందమూరి కుటుంబంలో రాజకీయంలోకి వచ్చి ఎక్కడా స్థిరంగా లేకుండా పోయారు పురంధరేశ్వరి.. నందమూరి బాలకృష్ణ టీడీపీ లో పాతుకుపోగా మొదటినుంచి రాజకీయాల్లో ఉంటూ వస్తున్న చిన్నమ్మ ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ వెళ్లి ఎక్కడా సరైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోలేదు.. చంద్రబాబు తొవైరం వలన ఆమె కాంగ్రెస్ లో చేరి అక్కడ రాజకీయాల్లో కొన్నేళ్లు రాణించి బాగానే స్థిరపడ్డారు అనుకున్నారు.. కానీ కొద్దీ కాలంలోనే ఆమె బీజేపీ లోకి వెళ్లి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. అయితే బీజేపీ లో ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులతో ఆమెకు పడట్లేదనే వాదన బయటకు వస్తుంది..

రాష్ట్ర బీజేపీ ఏమో కానీ కేంద్ర బీజేపీ మాత్రం రాష్ట్రంలోని మూడు రాజధానుల అంశంపై మంచి క్లారిటీ తో వుంది.. ఇది కేవలం రాష్ట్రాలను సంబందించిన విషయం తాము జోక్యం చేసుకోలేము అని సెంట్రల్ తెగేసి చెప్పింది.. దాంతో రాష్ట్ర బీజేపీ నేతలకు ఈ విషయంలో సపోర్ట్ చేయాలా వద్దా అన్న చిన్న అయోమయం నెలకొంది.. ఆ అయోమయంలోనే అమరావతి పరిరక్షణ పేరుతో కొందరు బీజేపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఆపడం లేదు. లోపాయకారిగా రాష్ట్ర బీజేపీ నేతలతో మంతనాలు చేస్తుందని అంటున్నారు.. పురంధరేశ్వరి కూడా అలాంటి వాదనలకు బలం చేకూరే విధంగా మాట్లాడడం ఇప్పుడు వివాదాస్పదమవుతుంది.

బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ని తీర్మానించింది. కానీ వైసీపీ మాత్రం హై కోర్ట్ నిర్మాణానికి పూనుకుంది.. ఆ దిశగా పనులు ప్రారంభించింది.. రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఇప్పుడిప్పుడు మూడు రాజధానులకు సముఖత చూపిస్తున్నారు.. అయితే పురంధరేశ్వరి భిన్నంగా వ్యాఖ్యానించడం ఆమె వ్యక్తిగతమా లేక బీజేపీ వైఖరా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఆమెకు తోడుగా నిన్న మొన్నటి వరకూ వెంకయ్యనాయుడు ఓఎస్డీగా కొనసాగి, ఇప్పుడు జాతీయ కార్యదర్శి అయిన సత్య కుమార్ కూడా అమరావతి అంశాన్ని ప్రస్తావించారు. దాంతో వీరి మాటలు కొంత వివాదాస్పదమయ్యాయి.. ఇలాంటి వైఖరితో బీజేపీకి మరింత నష్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

Loading...