Saturday, April 27, 2024
- Advertisement -

చంద్రబాబు కాల్ చేస్తే.. బ్లాక్ చేసిన టీడీపీ లీడర్లు..!

- Advertisement -

తెలుగు రాజకీయాల్లో చాలా సీనియర్ లీడర్ ఎవరైన ఉన్నారంటే అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే. బాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కున్నారు. కొన్నిసార్లు తిమ్మిని బిమ్మిని చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిని చూడలేదని అంటున్నారు టీడీపీ నేతలు. ఉత్తరాంధ్ర టీడీపీ విజయాల్లో చాలా ప్రధానమైనది.

టీడీపీకి బూత్ స్థాయిలో పట్టున్న ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే బాబు ఎందుకు వద్దు అన్నాడని అక్కడి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలలు పట్టుకున్నారు. విశాఖ అర్బన్ నాలుగు సీట్లు ఉంటే నాలుగు కూడా టీడీపీ దక్కించుకుంది. అలాంటి ఏరియాలో టీడీపీకి ఈ రోజు పట్టులేకుండా పోయింది. సరే ఉత్తరాంధ్రలో.. రాయలసీమ వలే కుల సమీకరణాల ప్రకారం వర్క్ అవుట్ కావడం కష్టమే. అందుకే ఉత్తరాంధ్రలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టాలని చంద్రబాబు భావించారట.

ఇందుకోసం బాబు వారికి ఫోన్ చేయగా.. చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఫోన్ లిఫ్ట్ చేయకుండా బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. కొందరి ఫోన్స్ అయితే పని కూడా చేయడం లేదట. ఇలా విశాఖను రాజధానిగా ఒప్పుకోని చంద్రబాబుకు ఉత్తరాంధ్ర నేతలంతా షాక్ ఇస్తున్నారు. అక్కడి ప్రజల్లో కూడా టీడీపీపై, చంద్రబాబు పై వ్యతిరేకం భావం ఏర్పడింది. బాబు చేజేతులారా బలమైన ప్రాంతాన్ని వదులున్నాడన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

రాపాక విషయంలో జగన్ ను ఫాలో అవుతున్న పవన్.. ఎలా అంటే ?

శంకుస్థాపన వాయిదా.. వెనుకడుగు వేసిన జగన్.. ఎందుకు ?

ఆదినారాయణ రెడ్డికి హైకోర్ట్ షాక్.. జగన్ సర్కార్ నిర్ణయం కరెక్ట్..!

వైఎస్సార్‌ చేయూత.. మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -