Saturday, April 27, 2024
- Advertisement -

జగన్ కు చిరంజీవి మద్దతు.. మెగాస్టార్ ఇచ్చిన సలహా ఇదే..!

- Advertisement -

ఏపీ రాజధానిపై వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలపై కొందరు నేతలు భిన్న అభిప్రయాలు వ్యక్త పరుస్తున్న వేళ.. ఏపీ సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతుగా నిలిచారు. ఏపీలో మూడు రాజధానుల నిర్ణయాన్ని అందరు స్వాగతించాలని అన్నారు. అభివృద్ది కావాలంటే అధికార, పరిపాలన వికేంద్రీకరణతో సాధ్యపడుతుందని అన్నారు. ఏపీ అభృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చాలా చేస్తున్నారని.. ఆయనపై నాకు నమ్మకం ఉందని చిరు తెలిపారు. అమరావతిని శాసన నిర్వాహక, విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక, కర్నూల్‌ను న్యాయపరిపాలన రాజధానులుగా మార్చే ఆలోచనను అందరం స్వాగతించాలన్నారు.

“ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతాల అభివృద్దికై నిపుణుల కమిటి సిఫారసులు.. సామాజిక, అర్ధిక అసమానతలు తొలిగించేవిగా ఉన్నాయి. అయితే గతంలో అభివృద్ది, పాలన అంత హైదరబాద్ లోనే కేంద్రీకృతమైంది. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి లోను కావడం వల్ల.. సామాజిక, అర్ధిక సమతుల్యాలుకు దెబ్బ పడింది. అయితే ఇప్పటికే 3 లక్షల కోట్ల అప్పుల్లో రాష్ట్రం ఉంది.

ఈ క్రమంలో మరో లక్ష కోట్లు అప్పు చేసి అమరావతిని నిర్మిస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సి వస్తుంది. పనులు లేక.. తాగు నీరు, ఉపాధి లేక.. తన ప్రాంతలను విడిచి వలస వెళ్తున్న చాలా మంది బిడ్డల భవిష్యత్తుకు, నిరుద్యోగులకు మూడు రాజధానులు కాన్సెఫ్ట్ భద్రతనిస్తోంది. అదే టైంలో రాజధాని రైతులలో నెలకొన్న భయాలను, ఆభద్రతాభావ్వి తొలించాలి. వాళ్ళు ఎలాంటి నష్టపోకుండా న్యాయం జరిగేలా చూడాలి. మూడు రాజధానులపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అపార్దాలు, అపోహాలను నివారించే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలని” జగన్ సర్కార్ కు మెగాస్టార్ చిరంజీవి సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -