Saturday, April 27, 2024
- Advertisement -

మోడీ నుంచి చిరు, చరణ్‍కు ఆహ్వానం.. ఎందుకు ?

- Advertisement -

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే తన నివాసంలో సినీ తారలతో సమావేశం నిర్వహించిన విషయం మనందరికి తెలిసిందే. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని మోడీ నివాసంలో జరిగిన ఆ కార్యక్రమానికి దక్షిణాది నుంచి పెద్దగా ఎవరు వెళ్లలేదు. దాంతో ఈ విషయంపై విమర్శలు బాగా వెల్లువెత్తాయి.

సినీ రంగం అంటే బాలీవుడ్ ఒక్కటే కాదని.. భారత అర్ధిక వ్యవస్థ అభివృద్దికి దక్షిణాది చిత్ర పరిశ్రమలు కూడా దోహదం చేస్తున్నాయని పలువురు కేంద్ర వైఖరిని ప్రశ్నించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోడలు.. రామ్ చరణ్ భార్య, అపోలో ఫౌండేషన్ అధినేత ఉపాసన కూడా మోడీని విమర్శించారు. ఈ నెపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ లను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. త్వరలోనే చిరు, చరణ్ ఢిల్లీ వెళ్లనున్నారు. త్వరలోనే తండ్రితో కలిసి ఢిల్లీ వెళ్తున్నట్లు ఓ జాతీయ మీడియాకు రామ్ చరణ్ తెలిపినట్లు సమాచారం.

ప్రస్తుతం ఉత్తారాది రాష్ట్రాల్లో ఎన్నికల జరుగుతుండటంతో ఆ సందడి తగ్గిన తర్వాత వెళ్లాలనుకుంటున్నామని చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే సైరా సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇక చరణ్ ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -