Saturday, April 27, 2024
- Advertisement -

బీజేపీకి వలసలు బలమా..? బలహీనత.?

- Advertisement -

కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. బడ్జెట్టు ప్రవేశపెట్టింది. దక్షిణాదికి మొండి చేయి చూపింది. రైల్వే బడ్జెట్ లో దక్షిణ భారత్ కు విదిల్చిందిలేదు. కేంద్రంలో అధికారంలో ఉండడంతో ఇప్పుడు బీజేపీని ఏ పార్టీ, ఏ రాష్ట్ర నేతలు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

వాపును చూసి బలుపు అనుకుంటే మొదటికే మోసమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు ఏపీలోనూ, తెలంగాణలోనూ ప్రజలకు మేలు చేయకుండా కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్నామని చెలరేగిపోతున్న బీజేపీ నేల విడిచి సాము చేస్తోంది. కేంద్ర పథకాలు, రైల్వే కేటాయింపుల్లో దక్షిణా భారతానికి ముఖ్యంగా తెలంగాణ, ఏపీల్లో అభివృద్ధి చేయకుండా కేవలం దేశాన్ని పాలిస్తున్న పార్టీగా వ్యవస్థలను గుప్పిట పట్టి రాజకీయ అధికారం చేపట్టాలనుకోవడాన్ని నాయకులు భయపడి చేరుతారు కానీ ప్రజలు మాత్రం ఇలాంటి ఢాంబికాలకు వెరవరు అని రాజకీయ విశ్లేషకులు కరాఖండిగీ చెబుతున్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనాలు ఒక్క సీటు ఇవ్వలేదు. నోటా కంటే తక్కువ ఓట్లు వేశారు. కేవలం 2 లక్షలకు పైచిలుకు ఓట్లు మాత్రమే ఏపీలో పడ్డాయి. ఇక తెలంగాణలో మాత్రం నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నారు. కానీ తర్వాత జరిగిన పరిషత్ ఎన్నికల్లో మాత్రం ఒక్క సీటును బీజేపీ గెలుచుకోకపోవడం విశేషం.

దీన్ని బట్టి బీజేపీ వలస నాయకులతో తెలంగాణ, ఏపీల్లో బలపడినా.. జనాల మదిని దోచుకోవడానికి మాత్రం పనితోపాటు అభివృద్ధి చేయాలి. అవేవీ చేయకుండా కేవలం నాయకులను లాగి అధికారం చేపడుతామంటే మాత్రం కలలు కల్లలవుతాయని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -