Friday, April 26, 2024
- Advertisement -

మ‌రో సారి నెట‌జ‌న్ల‌కు అడ్డంగా బుక్ అయిన‌ చిన‌బాబు

- Advertisement -

కుక్క‌తోక‌ర వంక‌ర అన్న సామెత ఏపీ మంత్రి, సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కు అతికిన‌ట్లు స‌రిపోతుంది. లోకేష్ రాజ‌కీయ ప‌రిజ్ణానం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌లు బ‌హిరంగ స‌భ‌ల్లో అత్యుత్సాహంగా అనాలోచితంగా మాట్లాడం నెటిజ‌న్ల‌కు దొర‌కిపోవ‌డం అల‌వాటుగా మారింది. ఆయన మాట్లాడే తెలుగుపై ఇప్పటికే సోషల్ మీడియాలో సెటైర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

బ‌హిరంగ స‌భ‌ల్లో త‌న స్పీచ్‌తో టీడీపీనే తిట్టడం,కామెడీ చేసి నవ్వులు పూయించడం లోకేష్‌కు మ‌హాస‌ర‌దా. అందుకే బాబు గ‌త కొన్ని నెల‌లుగా లోకేష్‌ను ట్విట్ట‌ర్‌కే ప‌రిమితం చేశారు. కాని ఇప్పుడు మాత్రం ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సిందే. ఎందుకంటె మంగ‌ళ‌గిరి అభ్య‌ర్ధిగా లోకేష్ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ట్విట్ట‌ర్‌కే ప‌రిమితం అయితే ఎక్క‌డ విమ‌ర్శ‌లు వ‌స్తాయోన‌ని ఎన్నిక‌ల ప్ర‌చారం బ‌రిలో దిగారు.

మంగళగిరిలో స్థానికంగా ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా తనకు సీటివ్వడంతో అక్కడ టీడీపీలో అసంతృప్తిని చల్లార్చడానికి చిన‌బాబు వెళ్లారు. తాను నోరు తెరిచి మాట్లాడితే ఎలా ఉంటుందో మ‌రోసారి రుచి చూపించారు. మంగళగిరిలో 1980నుంచి టీడీపీ గెలవలేదని, తాను గెలుస్తానో లేదో ప్రజలే నిర్ణయిస్తారని సెలవిచ్చారు. ఆమాట విన్న పార్టీ శ్రేణులు న‌వ్వుకోవ‌డం మొద‌లు పెట్టారు. 1982వ సంవత్సరంలో అయినపుడు అంతకు రెండేళ్లు ముందుగానే ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడం ఎలా సాధ్యం? అంటూ సోషల్ మీడియాలో జనం చినబాబును చెడుగుడు ఆడుకుంటున్నారు.

అది జ‌రిగి రెండు రోజులు కాక‌ముందే మ‌రో సారి నెటిజ‌న్ల‌కు అడ్డంగా దొరికిపోయారు. ఇంకే ముంది అస‌లే ఎన్నిక‌ల స‌మ‌యం కాబ‌ట్టి నెట‌జ‌న్లు చిన‌బాబును సామాజిక మాధ్య‌మాల్లో చెడుగుడు ఆడేసుకుంటున్నారు. మంగళగిరిలో ప్రచారం చేస్తున్న లోకేశ్‌ ఆదివారం రోడ్‌ షోలో మాట్లాడుతూ వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. అంతేనా మ‌రింత రెచ్చిపోయారు. ‘‘పాపం వివేకానందరెడ్డి గారు చనిపోయారు.. పరవశించాం. ఎవరు చేశారో తెలియదు గానీ చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేస్తున్నారంటూ త‌న మేధావి త‌నాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇంకే ముందు ఆ మాట ఆన‌డంతో నెటిజ‌న్లు చిన‌బాబుపై వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసే స‌మ‌యానికి చిన‌బాబు ఇంకెన్ని సిత్రాలు చేస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -