Friday, April 26, 2024
- Advertisement -

టీడీపీ నుంచి మ‌రో బిగ్ వికెట్ డౌన్‌

- Advertisement -

టీడీపీలో సీట్ల లొల్లి పంచాయితీ తారాస్థాయికి చేరింది. అసంతృప్తినేత‌ల‌ నుంచి వ‌స్తున్న ఒత్తిడిని బాబు త‌ట్టుకోలేక పోతున్నారు. టికెట్లు రాని అసంతృప్తి నేత‌లు పార్టీని వీడుతున్నారు. తాజాగా మ‌రో టీడీపీ ఎంపీ ఫ్యామిలీ పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారు. బాబుతో ఎన్నిసార్లు స‌మావేశం అయినా టికెట్ల‌పై క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో స‌ద‌రు ఎంపీ బ‌బుకు ఝ‌ల్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

న‌ర్సారావుపేట ఎంపీ, స‌త్తెన ప‌ల్లి ఎమ్మెల్యే సీట్ల‌ను కేటాయంచ‌డంతో చంద్రబాబు నాయుడు ఎటూ తేల్చకపోవడంతో రాయ‌పాటి కుటుంబం తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. ఈ సీట్ల‌పై మూడు సార్లు రాయ‌పాటి బాబుతో భేటీ అయినా ఫలితం లేక‌పోవ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన రాయ‌పాటి ఫ్మామిలీ టీడీపీకి గుడ్‌బై యోచనలో ఉంది.

అనారోగ్యం కారణంగా రాయపాటి సాంబశివరావుకు నర్సరావుపేట ఎంపీ స్థానం కేటాయింపు విషయమై చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారు. మొద‌ట నరస‌రావుపేట ఎంపీసీటు ఇస్తాన‌ని రాయ‌పాటికి బాబు హామీ ఇచ్చారు. అయితే చివ‌ర‌కు బాబు మొండిచేయి చూపారు. నరసరావుపేట లోక్ సభ టికెట్ ను ఇవ్వలేమని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పింది. రాయపాటి సోదరులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. న‌ర‌స‌రావుపేట ఎంపీ స్థానం త‌న‌కు కేటాయించ‌క‌పోతే త‌న కొడుకుకు స‌త్తెన‌పల్లి సీటునైనా కేటాయించాల‌ని బాబును కోరుతున్నారు.

తన కంటే మంచి అభ్యర్థి ఉంటే వారికే టికెట్ ఇచ్చుకోండని రాయపాటి అసహనం వ్య‌క్తం చేస్తున్నారు. రాయపాటి తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే విషయం తెలుసుకున్న వైసీపీ కీలక నేతలు వెంటనే రంగంలోకి దిగారు. రాయపాటి వర్గీయులకు ఫోన్ ద్వారా రాయబారం పంపారు. మరోవైపు, తన కుటుంబసభ్యులతో రాయపాటి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. సాయంత్రం పార్టీలో ఉండాలా లేదా అన్న‌ది తేల్చ‌నున్నారు రాయ‌పాటి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -