Saturday, April 27, 2024
- Advertisement -

కేసీఆర్ కోరకున్నా విలీనానికి కాంగ్రెస్ నేతల అడుగులు..

- Advertisement -

తెలంగాణలో రెండోసారి గద్దెనెక్కాక కేసీఆర్ కాంగ్రెస్ ను మరింత కృంగదీయడానికి వలసలను ప్రోత్సహించారు. మొత్తం 19 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 11 మంది కారెక్కేశారు. ఇప్పుడు మరో ఇద్దరు ఎక్కితే కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనం చేయొచ్చు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వరకు కేసీఆర్ వేచిచూశారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఒకవేళ మద్దతు అవసరం పడితే ఇవ్వవచ్చని.. విలీనాన్ని వాయిదా వేశారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు దెబ్బపడడంతో కాంగ్రెస్ విలీనం గురించే ఆలోచించడం లేదు..

కానీ కేసీఆర్ ఆలోచించకపోయినా.. ఈ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తెగ ఆవేశపడుతున్నారు. తమ శాసనసభాపక్షాన్ని గులాబీ పార్టీలో చేర్చడమే ధ్యేయంగా ముందడుగు వేస్తుండడం ఆసక్తి రేపుతోంది..

తెలంగాణ రాజకీయాల్లో అధికారమే పరమావధిగా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందుకే ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండలేమన్న భావనతో గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా తాండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. టీఆర్ఎస్ లోనే ఉండి గతంలో సస్పెండ్ అయిన రోహిత్.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి తాండూర్ లో బలమైన మాజీ మంత్రి మహేందర్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచాడు.

ఇప్పుడు అదే టీఆర్ఎస్ మాతృపార్టీలో రోహిత్ రెడ్డి చేరాలని డిసైడ్ అవ్వడం తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ పెంచింది. ఇప్పటికే నల్గొండ ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ అసెంబ్లీకి రాజీనామా చేశారు.ఇప్పుడు మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే కారెక్కేశారు. దీంతో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేయడం కామనే.. కేసీఆర్ కోరుకోకున్న కాంగ్రెస్ నేతలే ఈ అవకాశాన్ని కల్పించడం నిజంగా విడ్డూరమేనే చెప్పాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -