Friday, April 26, 2024
- Advertisement -

రేవంత్, కోమటిరెడ్డి జంపేనా? ఢిల్లీలో రహస్యచర్చులు.?

- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేయాలని ఆ ఇద్దరు డిసైడ్ అయినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రతిపక్ష కాంగ్రెస్ ను తుత్తునియలు చేస్తూ ఆ పార్టీ 12మంది ఎమ్మెల్యేలను లాగేసి అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్నే లేకుండా చేశాడు. దీంతో ఉన్న ఆరేడుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు ధర్నాలు, హైకోర్టుల వెంట పడ్డారు.

ఇక 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కడం.. కేసీఆర్ ధాటికి, వ్యూహాలకు వచ్చే 2024లో కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు కనిపించకపోవడంతో ఇప్పుడు టీకాంగ్రెస్ నేతలు కూడా ప్రత్యామ్మాయాల వైపు అడుగులు వేస్తున్నారు..

ప్రధానంగా టీఆర్ఎస్ అంటే పడని.. శత్రువులుగా భావించే తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కాంగ్రెస్ కంటే బీజేపీయే నయమని ఆ పార్టీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున ఎంపీలుగా గెలిచిన వారే..

తాజాగా వీరిద్దరూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు, మాజీ ఎంపీ వివేక్ లు బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరిపినట్టు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం లీకైంది.

తెలంగాణలో కాంగ్రెస్ బలపడే పరిస్థితి లేకపోవడం.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం.. మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకోవడంతో ఆ పార్టీ పగ్గాలు చేపట్టాలని రేవంత్, కోమటిరెడ్డి రాంమాధవ్ ను కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలను వీరు ఖండించినప్పటికీ భవిష్యత్ లో మాత్రం మారడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సీఎం కేసీఆరే కాదు.. ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని ఆపరేషన్ కాంగ్రెస్ కు ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది. దీనికి కాంగ్రెస్ నేతలే ముందుకు వస్తున్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -