రఘురామకృష్ణరాజు పై అనర్హత వేటు..?

964
YCP MPs Complained To Om Birla On Raghurama Krishnamraju
YCP MPs Complained To Om Birla On Raghurama Krishnamraju

రఘురామకృష్ణరాజు అంశం గురించి వైఎస్‍ఆర్‍సీపీ ఎంపీలు ఢిల్లీలో లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశం అనంతరం మీడియాతో వైసీపీ నేత విజయసాయి రెడ్డి మాట్లాడారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయడానికి వీలైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్లు.. అలానే అనర్హత పిటిషన్ సమర్పించినట్లు తెలిపారు. స్పీకర్ ఈ అంశంపై పలు విషయాలు పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చిరని వెల్లడించారు.

“ప్రజాస్వామ్యంలో పోలీటికల్ పార్టీ అనేది ఓ పునాది. అలాంటి పూనాదిని రఘరామకృష్ణరాజు కదిలించే ప్రయత్నం చేశారు. ఏ పార్టీ వల్ల ఆయన గెలిచారో.. ఆ విషయం మర్చిపోయి ఆ పార్టీకి వ్యతిరేకంగా నడ్చుకుంటున్నారు. పార్టీని తక్కువగా చూడటం.. పార్టీ అధ్యక్షుడ్ని లెక్కచేయకపోవడం.. అసభ్య పదజాలం ఉపయోగించడం వంటివి చేస్తున్నారు. సొంతపార్టిలో విపక్షం లాంటి వారు ఈ రఘురామకృష్ణరాజు. వైసీపీలో ఉంటూనే ఇతర పార్టీలతో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలతో మంతనాలు జరిపారు. అందుకే అనర్హత పిటిషన్ ను రూపొందించి స్పీకర్ కు ఇవ్వడం జరిగిందని.. అంతేకాకూండా సొంత పార్టీలో ఉన్న నాయకులను దూషిస్తున్నారని.. విపక్షాలతో లాలూచీ పడి దిగజారిపోయారు.

ఏదైనా ఉంటే పార్టీ అధ్యక్షుడికి చెప్పుకోవాలి. అంతేకానీ బహిరంగంగా మాట్లాడాలనుకోవడం పార్టీ విధివిధానాలకు అనుగుణం కాదు. రఘురామకృష్ణరాజు ఆరోపణల్లో విశ్వసనీయత లేదు. రఘురామకృష్ణరాజు భౌతికంగా వైసీపీలో ఉన్నా, ఆయన హార్ట్ అండ్ సోల్ మాత్రం ఇక్కడ లేదు. మనసా వాచా కర్మణా పార్టీ కోసం పనిచేసేవాళ్లే వైసీపీకి కావాలి. అందుకే ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నాం” అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.

Loading...