Friday, April 26, 2024
- Advertisement -

జగన్ ఇలా ప్లాన్ చేస్తే టీడీపీ ఏపీ లో ఉండను గాక ఉండదు..?

- Advertisement -

బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజు కు బలపడుతున్న తీరు చూస్తుంటే వచ్చే ఎన్నికలనాటికి ఎదో ఒకటి సాధించేలా కనపడుతుంది.. ఒకటి వైసీపీ ప్లేస్ లో అధికారంలోకి రావడం అయినా జరగాలి, లేదంటే టీడీపీ స్థానంలో ప్రధాన ప్రతిపక్షం లా అయినా ఎదగాలి.. ఈ రెండింటిలో ఇదొక స్థానానికి బీజేపీ రావడం ఖాయం అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.. అందుకే టీడీపీ పార్టీ ఇప్పటినుంచే బీజేపీ కి మోకరిల్లుతుంది.. సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు బీజేపీ కి దగ్గరయ్యి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు..

మొన్నటి ఎన్నికల్లో మోడీ ని దేశంలో ఏ నాయకుడు ఎక్కువగా విమర్శించాడు అంటే చంద్రబాబు అనిచెప్పాలి.. ఆంధ్ర కు రావాల్సిన ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ని పూర్తి విలన్ గా చేసి చంద్రబాబు ఆడిన మైండ్ గేమ్ కు మోడీ దిమ్మ తిరిగిపోయిందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.. చివరికి మోడీ తన మాటే నెగ్గించుకుని జగన్ సపోర్ట్ చేసి చంద్రబాబు ను అధికారంలోకి రానివ్వకుండా చేశాడు.. ఇంకేముంది జగన్ కూడా బీజేపీ తో ఇప్పుడప్పుడే వైరం ఎందుకని జగన్ కూడా బీజేపీ కి మద్దతు ఇస్తూనే వస్తున్నాడు.. అప్పుడప్పుడు మీటింగ్స్, భేటీలు వంటి వాటితో రాష్ట్రంలో మిగిలిపోయిన కొన్ని పనులను చేయించుకుంటున్నారు..

వాస్తవానికి జగన్ కు ఇప్పుడు బీజేపీ తో పొత్తు కట్టాల్సిన అవసరం లేదు..  ఆయన మీద కేసులు ఉన్నాయి అని భయపడేంత సీన్ కూడా లేదు. అవి ఎపుడో పెట్టిన కేసులు. ఇక కొత్తగా ఆయనకు జైలూ బెయిలూ భయం అంతకంటే లేదు. కానీ రాజకీయ కారణాలే జగన్ బీజేపీ కలిసేలా చేస్తాయని అంటున్నారు. తనను జైలు గోడల మధ్యన ఇరికించి యవ్వన ప్రాయంలో విలువైన కాలాన్ని హరించిన చంద్రబాబు మీదనే జగన్ కి పెద్ద లెక్క ఉందని అంటున్నారు. తాను ఎన్డీయేలో చేరాలంటే బాబు మీద సీబీఐ కేసులు పడాల్సిందే. ఇదే కండిషన్ మీద అయితే జగన్ కలిసే చాన్స్ ఉంది. ఏపీలో టీడీపీని నామరూపాలు లేకుండా చేయలంటే ముందు టీడీపీ పెద్దాయన లెక్కలు తేల్చాల్సిందేనని జగన్ థియరీగా ఉందంటున్నారు. దీనికి బీజేపీ ఎస్ అంటే చాలు ఎన్డీయేలో వైసీపీ చేరుతుంది. ఏపీలో బాబు జాతకం కూడా మారుతుంది అంటున్నారు విశ్లేషకులు.

అక్కడ టీడీపీ, వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట.?

వైఎస్సారా మజాకా.. ఇంకా తలుచుకుంటున్న జనం…?

చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -