Saturday, April 27, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ లండ‌న్ ప‌ర్య‌ట‌న ర‌ద్దు..

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. జ‌గ‌న్‌తో కేటీఆర్ భేటీ కావ‌డం ఎన్నిక‌ల వేడిన మ‌రింత రాజేసింది. ఎన్నిక‌ల‌కు త‌క్కువ స‌మ‌యం ఉండ‌టంతో అభ్య‌ర్తుల ఎంపిక‌పై దృష్టిపెట్టాడు వైఎస్ జ‌గ‌న్‌. పాద‌యాత్ర ముగిసిన త‌ర్వాత సొంత జిల్లా క‌డ‌ప‌లో మ‌కాం వేసిన జ‌గ‌న్ రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై దృష్టిపెట్టారు. అందులో భాగంగానే రెండు అసెంబ్లీ సెగ్మెంట్‌ల‌కు అభ్య‌ర్తుల‌ను ప్ర‌క‌టించారు.

అయితే ఫ్యామిలీతో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెల్లాల‌నుకున్న జ‌గ‌న్ అనూహ్య రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డంతో త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు. దేశ వ్యాప్తం కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌లో భాగంగా కేటీఆర్ జ‌గ‌న్‌తో భేటీ అయిన సంగ‌తి తెలిసిందే.

మ‌రో వైపు టీఆర్ఎస్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పొత్తు, తలసాని ఏపీ పర్యటన, వైఎస్ షర్మిల ఫిర్యాదు వంటి పరిణామాలతో రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. జ‌గ‌న్‌, కేటీఆర్‌లు క‌ల‌వ‌డంపై ప్ర‌తిప‌క్ష టీడీపీ మాట‌ల దాడి పెంచ‌డంలాంటి ప‌రిణామాల‌తో లండ‌న్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు.

ఎన్నికలకు కొద్ది స‌మ‌య‌మే ఉండ‌టంతో ప్రధాన పార్టీలు అస్త్ర‌, శ‌స్త్రాలు సిద్దం చేసుకొనే ప‌నిలో ప‌డ్డాయి. ఈ నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఇవాళ సాయంత్రం జగన్ హైదరాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సి ఉంది.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకుంటున్న కుమార్తెతో గడిపి ఈ నెల 22న తిరిగి హైదరాబాద్ రావాలన్నది జగన్ షెడ్యూల్.

తెలుగు రాష్ట్రాల‌కు న్యాయం జ‌ర‌గాలంటే పార్ల‌మెంట్‌లో ఎక్కువ మంది ఎంపీలు తెలుగు రాష్ట్రాల‌నుంచి ఉంటే న్యాయం జ‌ర‌గుతుంద‌ని ఇప్పటికే జ‌గ‌న్ తెలిపారు. ఇక చంద్ర‌బాబు కూడా దావోస్ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకుని ఆయ‌న స్థానంలో లోకేష్ వెల్తున్నారు.

త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే అనేక స‌ర్వేలు ప్ర‌క‌టించాయి. విభ‌జ‌న స‌మ‌యంలో కేంద్రం ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పార్ల‌మెంట్‌లో ఎక్కువ మంది ఎంపీలు ఉండాల‌ని జ‌గ‌న్ అనేక సార్లు ప్ర‌క‌టించారు. దానిలో భాగంగానే పార్ల‌మెంట్ స్థానాల గెలుపుపై దృష్టి సారించారు. దీనిలో భాగంగానే పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్ధుల‌తో సమీక్షా స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌నున్నారు జ‌గ‌న్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -