జంతువుల మధ్య ఈ ప్రేమను చూస్తే కన్నీల్లోస్తాయి..?

643
love between animals
love between animals

ప్రపంచంలో ప్రేమ కేవలం మానవునికి మాత్రమే సొంతం కాదు ఇక్కడ నివసిస్తున్న అన్ని జీవరాశులకు అది ఉంటుంది.. తమ జాతిలోని ఇతర జీవుల పట్ల ఎంతో ప్రేమాభిమానాలు కలిగి ఉండడమే కాకుండా అవి లేకుండా జీవించలేనంతగా అవి ప్రవర్తిస్తుంటాయి.. తాజాగా ఓ ఆవును కొనుక్కున్న వ్య‌క్తి దాన్ని వాహ‌నంలో అక్క‌డి నుంచి వేరే ప్రాంతానికి తీసుకెళ్తుండ‌గా దాని వెన‌కాలే ఎద్దు ప‌రుగులు తీసిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. దీంతో భార‌త్ లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న గురించి ప్ర‌పంచ వ్యాప్తంగా తెలిసింది.

ఇటీవ‌ల ఓ రైతు త‌న ఆవును అమ్మేయ‌గా దాన్ని ఓ వాహ‌నంలో తీసుకెళ్లారు. అయితే, ఆ ఆవును వాహ‌నంలో ఎక్కించిన వెంట‌నే ఎద్దు కంగారు ప‌డిపోయింది. దాన్ని వ‌దిలేయాల‌ని వేడుకుంటున్న‌ట్లు అటూ ఇటూ తిరిగింది. దీంతో వీధిలోని వారంద‌రూ ఆశ్చ‌ర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాల‌ను త‌మ స్మార్ట్ ఫోన్ల‌లో తీశారు. అయితే, చివ‌ర‌కు ఆ ఆవును వాహ‌నంలో తీసుకెళ్లిపోయారు. చాలా దూరం వ‌ర‌కు ఆ వాహ‌నం వెన‌కాలే ఎద్దు ప‌రుగులు తీసింది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఇది వైర‌ల్ కావ‌డంతో ల‌క్ష‌లాది మంది దీనిపై స్పందించారు.

దీంతో చివ‌ర‌కు వారి విజ్ఞ‌ప్తులు ఆ ఆవును కొన్న వ్య‌క్తుల వ‌ర‌కు వెళ్లాయి. దీంతో ఆ రెండింటినీ మ‌ళ్లీ క‌లిపి, పూజ‌లు చేశారు. మనసులను కదిలించే ఈ వీడియోను దేశంలోని ప్ర‌ముఖులు ట్వీట్ చేస్తున్నారు. హీరోయిన్ స‌మంత కూడా ల‌వ్ సింబ‌ల్ పోస్ట్ చేసి, ఈ వీడియోను షేర్ చేసింది.

Loading...