Friday, April 26, 2024
- Advertisement -

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్………. ఈసారి వైకాపాలోకి టిడిపి ఎంపి జంప్

- Advertisement -

జాతీయ స్థాయిలో ఏదో పొడిచేస్తానని ప్రగల్భాలు పలుకుతున్న చంద్రబాబుకు రాష్ట్ర స్థాయిలో టిడిపి నాయకులు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే జంప్ అవుతాడో? ఏ ఎంపి హ్యాండ్ ఇస్తాడో తెలియని పరిస్థితి. జంప్ అవుతాడని తెలుసుకుని మరీ చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ని పిలిచి ఎన్నికల్లో గెలవడానికి కోట్లాది రూపాయల ఫండ్, గెలిచాక మంత్రి పదవిలాంటి ఎన్నో ఆఫర్స్ ఇచ్చినప్పటికీ ఆమంచి మాత్రం చంద్రబాబును నమ్మలేదు. నీపైన నమ్మకం లేదు చంద్రబాబుగారు అంటూ డైరెక్ట్‌గా బాబుతోనే చెప్పేసి వైకాపాలోకి జంప్ అయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకోకముందే ఇప్పుడు తాజాగా ఇంకో సూపర్ షాక్ చంద్రబాబుకు తగలడానికి సిద్ధంగా ఉంది.

గంటా శ్రీనివాసరావుకు నమ్మకస్తుడిగా పేరుగాంచిన అనకాపల్లి టిడిపి ఎంపి అవంతి శ్రీనివాస్ త్వరలోనే వైకాపలోకి జంప్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి ఎలాగూ గెలవదు అన్న ఉద్ధేశ్యంతో స్వయంగా గంటానే అవంతిని వైకాపాలోకి పంపిస్తున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. రీసెంట్‌గా యనమల రామకృష్ణుడు కూడా తన ఇంటి మనిషిని ఎంచక్కా వైకాపాలోకి పంపించాడు. టిడిపి సీనియర్ నాయకులు కూడా 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపుపై నమ్మకం లేక వాళ్ళ ముఖ్య అనుచరులైన నాయకులు, బంధువులను వైకాపాలోకి పంపిస్తూ ఉండడం చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్‌లు ఇస్తోంది. విజయసాయిరెడ్డితో టచ్‌లోకి వెళ్ళిన అవంతి శ్రీనివాస్ సీటు కన్ఫాం చేస్తే వైకాపాలోకి వస్తానని విన్నవించుకున్నాడట. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లోనే వైఎస్ జగన్ నిర్ణయం తీసుకోనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి.

విశాఖ పరిధిలో సీనియర్ నాయకుడైన అవంతి శ్రీనివాస్ ఈ ఎన్నికల సమయంలో పార్టీని వీడితే మాత్రం అది కచ్చితంగా టిడిపికి అతి పెద్ద దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. అందుకే చంద్రబాబు కూడా వెంటనే మేలుకుని అవంతితో చర్చలు జరుపుతున్నారు. భారీ హామీలు ఇచ్చేస్తున్నాడు. మరి చంద్రబాబు ఇచ్చే ఆ హామీలను అవంతి నమ్ముతాడా? లేక అవంతి కూడా ఆమంచి లాగే పార్టీకి రాజీనామా చేసేస్తాడా? అయినా చంద్రబాబు హామీలను, బాబు చెప్పే మాటను స్వయంగా టిడిపి నాయకులే నమ్మని పరిస్థితి ఉంటే రేపు ప్రజలు నమ్మే అవకాశం ఉంటుందా? చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -