Saturday, April 27, 2024
- Advertisement -

మానవ ముఖంతో చేప.. చూడండి…!

- Advertisement -

ప్రస్తుతం మనిషి ముఖంతో ఉన్న చేప సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక మహిళ నీటిలో ఈత కొడుతున్న సమయంలో యాదృచ్చికంగా ఈ వీడియోని చిత్రీకరించింది. చైనాలోని మియావో గ్రామంలో ఈ చేపను చూసి ఆశ్చర్యపోయిన ఆ మహిళ వీడియో తీసింది. తర్వాత ఆ వీడియోని ఆ మహిళ తన సోషల్ మీడియా అకౌంట్ లో పెట్టింది. దాంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది.

ఆమె షూట్ చేసిన వీడియోలో చేపల ముఖం అచ్చం మనిషి పోలీకలతో కనిపిస్తోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. మానవ ముఖంను అచ్చుగుద్దినట్లు చేపకు ఉండటం నిజంగా ఆశ్చర్యమే. ప్రధానంగా కళ్ళు, నోరు , ముక్కు, మానవ పోలికలో ఉన్నాయి. అయితే గతంలోను ఇలాంటి వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

కానీ అవన్నీ మార్ఫింగ్ వీడీయోలు అని తెలింది. కానీ ఈ మానవ పోలికలతో ఉన్న చేప మాత్రం గ్రాఫిక్ మాయాజాలం కాదు. చేప కదలిక మనకు సులభంగా తెలిసిపోతుంది. అయితే ఇలాంటి చేప ఉండటం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇక ఇలాంటి చేపలు ఉండటం మాములే అని మత్స్య నిపుణులు అంటున్నారు. మీరు కూడా ఆ వీడియోని చూసేయండి.

https://www.youtube.com/watch?v=vKTg0gfiC50

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -