సొంత మరదల్ని పెళ్లి చేసుకున్న హీరోలు వీరే..!

- Advertisement -

ఎన్టీఆర్:
వెండితెర పై ఓ వెలుగు వెళిగారు సీనియర్ ఎన్టీఆర్. బసవతారకం ఎన్టీఆర్ కి సొంత మరదలి వరుస అవుతుంది. ఆయన 1942లో ఆమెను పెళ్లాడారు. ఆర్ధికంగా ఎన్టీఆర్ కుటుంబం ఉన్నతంగా లేనప్పటికీ బసవతారకం ఒత్తిడితోనే ఆమె తండ్రి ఎన్టీఆర్ కి ఇచ్చి పెళ్లి చేశారట

ఏ ఎన్ ఆర్ :
ఏ ఎన్ ఆర్ అన్నపూర్ణమ్మను 1949లో పెళ్లాడడం జరిగింది. అప్పటికే సినిమా హీరోగా ఆయన 10సినిమాల వరకు నటించారు. అయితే అన్నపూర్ణమ్మను వాళ్ళ నాన్నగారు. సినిమాలంటూ తిరిగే వాడికి నా కూతురిని ఇవ్వను ససేమిరా అన్నారట. ఎలాగైతే నేమి ఏ ఎన్ ఆర్ మామను ఒప్పించి, మరదలి చేయి అందుకున్నారు.

- Advertisement -

కృష్ణ :
సూపర్ స్టార్ కృష్ణ సైతం సొంత మరదలు ఇందిరా దేవిని వివాహం చేసుకున్నారు. 1961లో వీరి వివాహం జరిగింది. అప్పటికి కృష్ణ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. 1965లో ఆయన నటించిన తేనే మనసులు విడుదల అయ్యింది. కృష్ణ నటి విజయ నిర్మలను కూడా పెళ్లాడిన విషయం తెలిసిందే.

మోహన్ బాబు :
మోహన్ బాబు కూడా సొంత మరదలినే పెళ్లిచేసుకున్నారు. ఆయన తన మరదలు విద్యా దేవిని పెళ్లిచేసుకున్నారు. ఆమె హఠాన్మరణం తరువాత ఆమె సొంత చెల్లెలు నిర్మలా దేవిని చేసుకున్నారు. దశాబ్దాలుగా వీరిది అన్యోన్య దాంపత్యంగా ఉంటూ వస్తుంది.

ఆది :
సాయి కుమార్ నటవారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ వివాహం ఆడింది సొంత మరదలినే. సాయి కుమార్ భార్య తమ్నుడి కూతురిని ఆది పెళ్లి చేసుకున్నారు. వీరిది చిన్నప్పుడే పెద్దలు నిర్ణయించిన వివాహమట.

కార్తీ:
తెలుగు వారికి బాగా సుపరిచితుడు హీరో కార్తీ సొంత మరదలు రజిని అనే అమ్మాయిని పెళ్లిచేసుకున్నారు. రజిని ఎం ఏ లిటరేచర్ గోల్డ్ మెడలిస్ట్ అని సమాచారం.

శివ కార్తికేయన్ :
రెమో చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో శివ కార్తికేయ మరదలు ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ పాప కూడా ఉంది.

బుల్లితెర నటీమణుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీరే..!

మన స్టార్స్ నోరు జారినప్పుడు.. జరిగిన వివాదం..!

మన టాలీవుడ్ హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలుసా ?

Most Popular

Related Articles

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

‘‘వాడు పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ’’… అంటూ వరల్డ్‌వైడ్‌గా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న 'రామరాజు ఫర్‌ భీమ్‌' . ఎంటైర్‌ ఇండియా ఎంతో ఆసక్తిగా...

రాజమౌళి బర్త్ డేకి చరణ్, ఎన్టీఆర్ ఏం గిఫ్ట్ ఇచ్చారంటే ?

నేడు (అక్టోబర్ 10) టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు. ఆయన నేడు తన 48వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు...

ఎన్టీఆర్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా ?

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మరో హీరోగా రామ్ చరణ్ నటిస్తున్నాడు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే త్రివిక్రమ్...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...