Friday, April 26, 2024
- Advertisement -

షాకింగ్….. ఆంధ్రజ్యోతి, ఈనాడులను అడ్డంగా బుక్ చేసిన సుజనా

- Advertisement -

దేవుడా……… ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందన్నట్టుగా తయారైంది ఈనాడు, ఆంధ్రజ్యోతిల పరిస్థితి. అవినీతి, అక్రమ వ్యవహారాలతో నిండా మునిగిన చంద్రబాబు సన్నిహితుడు, టిడిపి ఎంపి సుజనా చౌదరి ఇప్పుడు ఏకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతిలను కూడా అడ్డంగా బుక్ చేశాడు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ఆర్థికంగా నిలిచిన సుజనా చౌదరి సొమ్ము మొత్తం ప్రజలు దాచుకున్న బ్యాంకుల నుంచి అడ్డగోలుగా కొట్టేసిన సొమ్మే అని ఈడీ తేల్చేసింది. ఏకంగా 6వేల కోట్ల రూపాయల భారీ స్కాంలో మూల పురుషుడిగా ది గ్రేేట్ నిప్పు నారా బాబు సన్నిహితుడు సుజనా చౌదరి దోషి అని ఈడీ తేల్చేసింది.

ఇదే దోపిడీలో జగన్ పేరు కనుక వినిపంచి ఉంటే ఈనాడు, జ్యోతి, టివి9లాంటి ఎల్లో మీడియా సంస్థలు ఏ రేంజ్‌లో రెచ్చిపోయి ఉండేవో చెప్పనవసరం లేదు. అయితే అడ్డంగా దొరికింది చౌదరి కాబట్టి…..సదరు సుజనా చౌదరిగారు చంద్రబాబుకు స్వయానా బినామీ అన్న విషయం ఎప్పటి నుంచో వినిపిస్తున్నదే కాబట్టి ఎల్లో మీడియా మొత్తం అలర్ట్ అయింది. సుజనా చౌదరిని ఈడీ దోషి అని చెప్పినప్పటికీ సుజనా చౌదరి పులుకడిగిన ముత్యం అని, సదరు ఈడీదే తప్పంతా అని టముకు వేశాయి. సిబిఐ, ఈడీలే దోషులు అనేలా వార్తలు వండివర్చాయి. సుజనా చౌదరి అవినీతి, అక్రమ వ్యవహారాలు………సదరు సుజనాతో చంద్రబాబుకు ఉన్న బంధం గురించి ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా వార్తలు ప్రచురించాయి.

అయితే ఎల్లో మీడియా ఈ సారి ప్రజలను తప్పుదోవ పట్టించే విషయంలో సక్సెస్ అవ్వలేకపోయిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈడీ, సిబిఐ సంస్థలను కేంద్ర ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపిస్తూ సాగిన ఎల్లో మీడియా రాతల పుణ్యమాని వైఎస్ జగన్ కూడా నిర్దోషే…..సోనియానే కక్ష్యకట్టి జగన్‌పై కేసులు పెట్టించింది అని ఎప్పటి నుంచో న్యాయనిపుణులు, ఆర్థిక నిపుణులు చెప్తున్న విషయాలకు ఇప్పుడు బలం చేకూరినట్టయింది. ఆ మధ్య కిరణ్ కుమార్‌రెడ్డి సోదరుడు పార్టీలో చేరిన సందర్భంగా స్వయంగా చంద్రబాబు కూడా ‘సోనియాను ఎదిరించబట్టే జగన్‌పై కేసులు’ అని నిజం చెప్పేశాడు. సిబిఐ, ఈడీలు చెప్పాయి అంటూ సంవత్సరాలుగా జగన్ అవినీతి గురించి రకరకాలు వార్తలు వండి తెలుగు ప్రజల ఆలోచనల్లో విషం నింపిన ఎల్లో మీడియానే ఇప్పుడు స్వయంగా జగన్‌పై కేసులన్నీ సోనియానే పెట్టించింది, సోనియానే సిబిఐ, ఈడీలను జగన్‌కి వ్యతిరేకంగా ఆడించింది అన్న విషయం ఇప్పుడు ఒప్పుకున్నట్టయింది.

ఇంకా చెప్పాలంటే సుజనా చౌదరి విషయంలో అవినీతి, అక్రమాలన్నీ కంటికి కనిపిస్తున్నాయి, బలమైన సాక్ష్యాలున్నాయని, జగన్ కేసుల విషయంలో ఈ రోజుకీ ఒక్క సాక్ష్యాన్ని కూడా విచారణా సంస్థలు చూపించలేకపోయాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అలాగే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై ఇష్టారీతిన వార్తలు ప్రచురించిన ఎల్లో మీడియాపై న్యాయస్థానంలో కేసులు వేసే దిశగా ఈడీ వర్గాలు కదులుతున్నాయని ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. ఏది ఏమైనా తమ వర్గానికి చెందిన చౌదరి, చంద్రబాబుకు సన్నిహితుడైన సుజనా చౌదరి అక్రమాలు బయటపడేసరికి ఆ అక్రమాలను సమర్థించడానికి అడ్డంగా తెగించిన ఎల్లో మీడియా స్వయంగా బుక్కవ్వడంతో పాటు, పరోక్షంగా జగన్‌ అవినీతికి పాల్పడలేదు, జగన్‌పైన సోనియా, బాబులు కలిసి కక్ష్యసాధింపుకు పాల్పడ్డారు అని కొన్నేళ్ళుగా విశ్లేషకులు చెప్తున్న నిజాలను ఒప్పుకున్నట్టయిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -