Saturday, April 27, 2024
- Advertisement -

ధోనీ వార‌సుడు పంత్‌పై సెహ్వాగ్ కామెంట్స్‌..

- Advertisement -

2019 ప్రపంచకప్‌ వరకు సీనియర్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని జట్టులో కొనసాగల్సిందేనని టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్‌లో యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో పంత్‌ను వ‌న్డేల్లోకి తీసుకోవాల‌నే డిమాండ్ రోజు రోజుకీ పెరుగుతోంది.

సిక్స్‌తో టెస్టు క్రికెట్‌లో తన పరుగుల ఖాతా తెరిచిన రిషబ్ పంత్.. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిక్స్ బాది తొలి సెంచరీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అయితే ధోనీ స్థానంలో పంత్‌ను తీసుకోవాల‌న్న డిమాండ్‌పై మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సేహ్వాగ్ స్పందించారు.

మ్యాచ్ ఎలాంటి స్థితిలో ఉన్నా.. రిషబ్ పంత్ సిక్సర్లు కొట్టగలడు. ఇక ధోనీ గురించి చెప్పాల్సి వస్తే..? అతను భారత్‌ తరఫున ఇప్పటికే ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. కాబట్టి.. 2019 ప్రపంచకప్‌లో వికెట్ కీపర్‌గా ధోనీనే ఆడించాలి. ఆ తర్వాత అతను రిటైర్మెంట్ తీసుకుంటే.. నిరభ్యంతరంగా పంత్‌కి కీపింగ్ బాధ్యతలు అప్పగించొచ్చు. భారత జట్టులో ధోనీకి వారసుడు అతనే’ అని సెహ్వాగ్ వెల్లడించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -