Saturday, April 27, 2024
- Advertisement -

రెండో టెస్ట్‌కు ముందే భార‌త్‌కు భారీ దెబ్బ‌..కీల‌క ఆట‌గాల్లు దూరం

- Advertisement -
   

ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఆతిథ్య జట్టును మట్టికరిపించి మధుర విజయాన్ని సొంతం చేసుకున్న టీమిండియాకు రెండో టెస్టు ఆరంభానికి ముందే ఎదురుదెబ్బ తగిలింది. పెర్త్‌ వేదికగా జరిగే ఈ టెస్టుకు గాయం కారణంగా కీల‌క ఆట‌గాళ్లు దూరం అయ్యారు.

ఈ నేపథ్యంలో 13 మందితో కూడిన తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది.స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ రవిచందర్ అశ్విన్ లను బీసీసీఐ పక్కన పెట్టింది. టీనేజ్ ఓపెనర్ పృథ్వి షా కాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని… అతని పేరును రెండో టెస్టుకు పరిశీలించలేదని బీసీసీఐ తెలిపింది. గాయపడ్డ రోహిత్ శర్మ ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడని, అందుకే అతన్ని పక్కన పెట్టామని వెల్లడించింది.

అశ్విన్ కడుపునొప్పితో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడని, ఈ నేపథ్యంలో అతన్ని కూడా ఎంపిక చేయలేదని తెలిపింది. 13 మందితో కూడిన జట్టులోకి ఉమేష్ యాదవ్, ఆంధ్ర కుర్రాడు హనుమ విహారి, రవీంద్ర జడేజాలు వచ్చారు.

ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌ గెలవాలన్న కసితో ఉన్న టీమిండియాకు అశ్విన్‌ లేకపోవడం ఎదురుదెబ్బే అని చెప్పాలి. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు పెర్త్‌ పిచ్‌ టీమిండియా కంటే ఆసీస్‌ ఆటగాళ్లకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది.

టీమిండియా జట్టు ఇదే:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే (వైస్ కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -