Friday, April 26, 2024
- Advertisement -

దినేష్ కార్తిక్ ను కనికరించిన బీసీసీఐ…

- Advertisement -

టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తిక్ కు బీసీసీఐ నుంచి ఊరట లభించింది. బేషరుతుగా బోర్డుకు క్షమాపణలు చెప్పడంతో ఎట్టకేలకు మన్నించింది.వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)‌‌కి ఇటీవల హాజరైన దినేశ్ కార్తీక్ అక్కడ ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ టీమ్ జెర్సీ ధరించి మరీ మ్యాచ్‌ని వీక్షించాడు.

నైట్‌రైడర్స్‌ జట్టు డ్రెస్సింగ్ రూము నుంచి దినేశ్ కార్తీక్ మ్యాచ్‌ని చూస్తున్న ఫొటోలు బీసీసీఐ చేతికి చిక్కడంతో.. క్రమశిక్షణరాహిత్యం కింద అతడికి బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రి నోటీసులు పంపారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని నిబంధనల్ని ఉల్లఘించిన నీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో..? చెప్పాలని అందులో పేర్కొన్నారు. అయితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం అలా చేయడం నేరం. ముందుగా బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

భారత్‌లో ఐపీఎల్‌ తరహాలో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు ప్రైవేట్ టీ20 లీగ్స్‌ని నిర్వహిస్తున్నాయి. వాటిలో ఆడేందుకు టీమిండియా క్రికెటర్లని మాత్రం బీసీసీఐ మొదటి నుంచి అనుమతించడంలేదు.బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఏ క్రికెటర్ కూడా నిబంధనల ప్రకారం బీసీసీఐ ముందస్తు అనుమతి లేకుండా.. ఈ టీ20 లీగ్స్‌లో పాల్గొనడం, ఆ టోర్నీలను ప్రమోట్ చేయడం నిషిద్ధం.

తప్పు తెలుసుకున్న దినేష్ బీసీసీఐకి బేషరుతుగా క్షమాపణలు చెబుతూ లేఖ రాశారు.ఇకపై ఇలాంటి తప్పులు చేయబోనని హామి ఇచ్చిన కార్తీక్.. బీసీసీఐకి బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. దీంతో.. ఈ వికెట్ కీపర్ తప్పుని మన్నించిన బీసీసీఐ ఇంతటితో ఈ వివాదం ముగిసినట్లు ప్రకటించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -