Friday, April 26, 2024
- Advertisement -

విశ్వ‌విజేత‌కు బిగ్ షాక్ ఇచ్చిన ప‌సికూన ఐర్లాండ్‌.. 85 ప‌రుగుల‌కే ఆల్‌ ఔట్‌

- Advertisement -

విశ్వ‌విజేత అయిన ఇంగ్లండ్‌కు ప‌సికూన ఐర్లాండ్ బిగ్ షాక్ ఇచ్చింది. ద‌శాబ్దాల‌క నిజం చేసుకుని రెండు వారాలు గ‌డ‌వ‌క ముందే ఆనందం ఆవిరైంది. ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టును ఎదుర్కోవ‌డం అంత సులువైన ప‌నికాదు. అంతే కాదు ఇంగ్లండ్ టీమ్‌లో అద్భుత‌మైన హిట్ట‌ర్లు ఉన్నారు. కానీ పసికూన ఐర్లాండ్ మాత్రం ఇంగ్లాండ్‌ జట్టుకు చుక్కలు చూపించింది.

లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్లు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లను 85 పరుగులకే ఇంగ్లండ్‌ను కుప్ప కూల్చారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టులో జో డెన్లే(23), ఒల్లి స్టోన్(19), శామ్ కర్రన్(18) మినహా మిగితా వారందరూ అత్యల్ప తక్కువ స్కోరుకే ఔటయ్యారు. టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23.4 ఓవర్లకు కేవలం 85 పరుగులకే కుప్పకూలింది. బౌల‌ర్ల ధాటికి బెయిర్‌స్టో, మోయిన్‌ అలీ, క్రిస్‌ వోక్స్‌ అయితే ఖాతా కూడా తెరవలేకపోయారు .

ప్రపంచకప్‌ను ముద్దాడిన క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో ఆంగ్లేయులకు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అంతేనా అతి తక్కువ ఓవర్లకే ఒక ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ కావడం ఇది ఐదోసారి. ఐర్లాండ్‌ బౌలర్లు టిమ్‌ ముర్తగ్‌ (9-2-13-5), మార్క్‌ అదైర్‌ (7.4-1-32-3) ప్రత్యర్థిని బెంబేలెత్తించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -