Friday, April 26, 2024
- Advertisement -

కాషాయ కండువా క‌ప్పుకున్న మాజీ క్రికెట‌ర్‌..

- Advertisement -

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గ‌త కొద్దిరోజులుగా భాజాపాలో చేరుతున్నార‌నే వార్త‌లపై ఆచితూచి స్పందించిన గంభీర్ చివ‌ర‌కు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. శుక్రవారం బీజేపీలో చేరిన గౌతీ.. ఇక రాజకీయాల్లో బిజీ కానున్నాడు. కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, అరుణ్ జైట్లీ.. గంభీర్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అతను పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. క్రికెట్‌లో నాకు చేతనైనంతగా దేశానికి సేవలందించాను. ఇక ఈ రంగంలోనూ నా వంతుగా దేశానికి సేవలందిస్తాను అని పార్టీలో చేరిన తర్వాత గంభీర్ తెలిపాడు. 37 ఏళ్ల గంభీర్.. గతేడాది డిసెంబర్‌లో క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. 13 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడిన గౌతీ.. టీమిండియా 2011 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్టుల్లో 9, వన్డేల్లో 11 సెంచరీలు చేశాడు. ఈ మధ్యే పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -