తండ్రి కాబోతున్న హార్దిక్ పాండ్యా.. పెళ్లి ఎప్పుడు అయింది ?

790
hardhik pandya shock to fans with marriage pics
hardhik pandya shock to fans with marriage pics

ఈ ఏడాది మొదట్లో జనవరి ఒకటో తేదిన సెర్బియాకు చెందిన నటి, మోడల్ నటాషా స్టాన్ కోవిచ్ తో హార్దిక్ పాండ్యాకు ఎంగెజ్మెంట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడూ తాను తండ్రిని కాబోతున్నానని చెప్పాడు హార్ధిక్ పాండ్యా. అయితే వీరిద్దరికి పెళ్లి ఎప్పుడు జరిగిందో అనేదానిపై స్పష్టత లేదు.

కానీ నిన్న ఆయన విడుదల చేసిన ఫోటోలో.. ఇద్దరూ దండలు వేసుకుని కనిపించారు. ఇదే పెళ్లికి సంబంధించిన ఫోటోనా ? అన్న విషయమై స్పష్టత లేదు. హార్దిక్ పెట్టిన చిత్రాలను చూసిన వారు ఒకింత షాక్ కు గురై, ఆ తరువాత తేరుకుని విషెస్ చెప్పారు. “మా జీవితాల్లో న్యూ లైఫ్ కి వెల్ కం పలకనున్నాం. అందుకోసం మేమిద్దరం ఎంతో ఉత్సుకతతో ఎదురు చూస్తున్నాం. కొత్త దశలోకి అడుగు పెడుతూ ఉన్నందుకు సంతోషంగా ఉంది. మీ ఆశీర్వాదం, దీవెనలు నాకు కావాలి.

నటాషాతో నా ప్రయాణం గొప్పగా ఉంటుంది. మున్ముందు మా బంధం మరింత బలపడుతుందని నమ్ముతున్నా” అని చెప్పాడు. హార్దిక్ కు ఇప్పుడు ఇతర క్రికెటర్లు, ప్రముఖుల నుంచి శుభాభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక హారిక్ గాయం కారంగా టీమిండియాకు దూరమైయ్యాడు. ఇప్పుడు మంచి ఫాంలో ఉన్నాడు. ఐపీఎల్ లో తన సత్తా చూపించి మళ్లీ టీమిండియాలో చోటు సంపాధించాలని చూస్తున్నాడు. అయితే ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. మరి ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న దానిపై ఇంకా ఏం క్లారిటీ లేదు.

Loading...