Friday, April 26, 2024
- Advertisement -

గాయంపై గ‌బ్బ‌ర్ ట్వీట్‌కు ఫిదా అవుతున్న భార‌త అభిమానులు…

- Advertisement -

అర్ధశతకాలు, శతకాలు బాదేస్తాడు. జట్టు విజయాల్లో కీలకంగా నిలుస్తాడు. ప్రస్తుత ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లోనూ అంతే. ఆస్ట్రేలియాపై అద్భుత శతకం సాధించాడు. వేలు నొప్పిని సహిస్తూ అతడు పరుగులు చేశాడని తెలిసిన తర్వాత అభిమానులు మరింత ఫిదా అయ్యారు.

మ్యాచ్‌లో గ‌బ్బ‌ర్ కు గాయం అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో అత‌ను పూర్తిగా టోర్న‌మెంట్‌కు దూరం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. గాయం తీవ్ర‌త దృష్ట్యా మూడు వారాలు రెస్ట్ తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించారు. అప్ప‌టికి గాయం త‌గ్గ‌క‌పోతె టోర్నీనుంచి త‌ప్పుకోనున్నారు. త‌న గాయంపై గ‌బ్బ‌ర్ చేసిన ట్వీట్ కు అభిమానులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.డాక్టర్‌ రహత్‌ ఇందోరీ రాసిన ఓ పద్యాన్ని పోస్టు చేసి తన ఉద్దేశమేంటో పరోక్షంగా వెల్లడించాడు.

గాయం నుంచి కోలుకొని మైదానంలోకి అడుగుపెడ్తాననే తన ఉద్దేశాన్ని వెల్లడించాడు. గాయానికి సంబంధించిన ఫొటోలకు ఈ పద్యాన్ని క్యాప్షన్‌గా పేర్కొంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌కు ముగ్దులైన భారత అభిమానులు.. గబ్బర్‌ను ఆకాశానికెత్తుతున్నారు.

రెక్కలతో ఎగరడం లేదు..
మా గుండె లోతుల్లోని నమ్మకం,
ఆత్మవిశ్వాసంతో ఎగురుతున్నాం’ అనే అర్థం వచ్చేలా ఆ పద్యం ఉంది. దీనిని బట్టి అతడు గాయం నుంచి కోలుకొని వచ్చాక పరుగుల వరద పారించడం ఖాయమే అనిపిస్తోంది. ఇలాంటి చిన్నచిన్న గాయాలు తన నమ్మకాన్ని సడలించలేవని చెప్పకనే చెప్తున్నాడు. గబ్బర్‌ పట్టుదల గురించి అందరికీ తెలిసిందే. గాయపడ్డ అతడి స్థానంలో యువ ఆటగాడు రిషభ్‌పంత్‌ ఇంగ్లాండ్‌కు వెళ్తాడని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -