Friday, April 26, 2024
- Advertisement -

రిషబ్ పంత్ విఫలంకు కారణం ఇదేనట..!

- Advertisement -

టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన ప్రదర్శన గొప్పగాలేదని ఇప్పటికే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌తో ఫామ్ లోకి వచ్చిన.. కీపింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. విండీస్‌తో ఆఖరి వన్డేలో ఏకంగా 4 క్యాచ్‌లను వికెట్ల వెనుక జారవిడిచాడు.

దాంతో వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పంత్‌ని ఆడించడంపై టీమిండియా మేనేజ్ మెంట్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. పంత్ కీపింగ్ విఫలంకు కారణాలను తాజాగా భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. “కీపింగ్ బాగా చేయలేకపోతే.. ఆ ఒత్తిడి బ్యాటింగ్ పై ఉంటుంది. అలానే బ్యాటిమంగ్ సరిగ్గా చేయలేకపోతే ఆ ప్రభావం కీపింగ్ పై ఉంటుంది. మైదానంలో ఆటగాళ్లు ఒత్తిడికి గురి అవుతే తమ వద్దకి వచ్చిన బంతి వేగంగా అందుకోలేరు.

ఇప్పుడు రిషబ్ పంత్ విషయంలో అదే జరిగింది. ఒత్తిడిలో ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు బంతిని అందుకునే విధానంలో తేడా ఉంటుంది. అతను దేశవాళీ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. కాబట్టి.. అనుభవం లేకపోవడం కూడా ఓ కారణంగా మనం చెప్పొచ్చు. ఏది ఏమైనా.. కెరీర్ ఆరంభంలోనే పంత్‌కి ఇలాంటి ఎదురుదెబ్బలు తగలడం మంచిదే. వాటి నుంచి అతను పాఠాలు నేర్చుకుని బలంగా నిలబడే ఛాన్స్ ఉంది” అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -