Friday, April 26, 2024
- Advertisement -

మూడో టెస్ట్‌లో ఇంగ్లండుపై టీమిండియా ఘ‌న విజ‌యం..ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కోహ్లీ

- Advertisement -

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌ ఘనవిజయం సాధించింది. 311/9 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ 17 బంతుల్లోనే చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 317 పరుగులకు ముగియడంతో కోహ్లిసేన 203 పరుగుల భారీ విజయాన్నందుకుంది.

ఇంగ్లండ్ గడ్డపై వరుసగా రెండు టెస్టులు ఓడిపోయే సరకి ఎన్నో విమర్శలు, దెప్పిపొడుపులు. అయినా, ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గెలవాలనే ఏకైక లక్ష్యంతో మూడో టెస్టులో బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లు… తొలి రోజు నుంచే ఇంగ్లండ్ పై పైచేయి సాధించి… చివరకు మూడో టెస్టును కైవసం చేసుకున్నారు. నాటింగ్ హామ్ లో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో, ఐదు టెస్టుల సిరీస్ లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది.

నిన్న నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 9 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. చివరి వికెట్ తీయడానికి భారత బౌలర్లు యత్నించినప్పటికీ… సాధ్యం కాలేదు. దీంతో, ఒక వికెట్ తీయడం కోసం ఐదో రోజు బరిలోకి దిగింది ఇండియా. 30 పరుగులో ఉన్న రషీద్, 8 పరుగులతో ఆడుతున్న అండర్సన్ బ్యాటింగ్ కు దిగారు. ఈరోజు తొలి ఓవర్ ను పాండ్యా మెయిడిన్ గా వేశాడు. రెండో ఓవర్ వేసిన షమీ 2 పరుగులు ఇచ్చాడు. మూడో ఓవర్ వేసిన అశ్విన్ ఐదో బంతికి అండర్సన్ ను ఔట్ చేశాడు. స్లిప్ లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చి అండర్సన్ పెవిలియన్ చేరాడు. దీంతో, 317 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది.

ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కీలక ఇన్నింగ్స్‌లకు, రహానే, పుజారాలు తోడవ్వడంతో ఇంగ్లండ్‌కు 521 పరుగుల భారీ లక్ష్యం నమోదైన విషయం తెలిసిందే. ఇక బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్‌ పాండ్యా, రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్లతో చేలరేగడంతో భారత విజయం సులువైంది. రెండో టెస్టులో సమిష్టిగా విఫలమై మూల్యం చెల్లించుకున్న భారత్‌ ఈ మ్యాచ్‌లో సమిష్టి ప్రదర్శనతోనే విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్ లో విశ్వరూపం ప్రదర్శించిన కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తొలి ఇన్నింగ్స్ లో 97, రెండో ఇన్నింగ్స్ లో 103 పరుగులతో కోహ్లీ చెలరేగిపోయాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో పాండ్యా 5 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -