Friday, April 26, 2024
- Advertisement -

టీ20ల్లో మరో రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ..!

- Advertisement -

బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నింట్లో కోహ్లీ సేన మంచి ప్రదర్శన చేస్తోంది. కొత్త ఏడాదిని విజయంతో టీమిండియా ఆరంభించింది. మూడు టీ20ల సిరిస్‌లో బోణీ కొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో భారత జట్టు కెఫ్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించారు. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు అందుకున్న కెప్టెన్‌గా అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంక పేసర్ లిసత్ మలింగ బౌలింగ్‌లో సింగిల్‌ తీయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. శ్రీలంకతో మూడు టీ20ల సిరిస్ ప్రారంభానికి ముందు ఈ మైలురాయిని చేరుకోవడానికి విరాట్ కోహ్లీ 25 పరుగులు దూరంలో ఉన్నాడు.

అయితే, రెండో టీ20లో కోహ్లీ 17 బంతుల్లో 2 సిక్స్‌లు, ఒక ఫోర్ సాయంతో అజేయంగా 30 పరుగులు చేశాడు. కాగా, ఈ జాబితాలో ధోని 62 మ్యాచ్‌ల్లో 1112 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఘనత సాధించిన రెండో కెఫ్టెన్ గా భారత్ తరుపున కోహ్లీ నిలిచాడు. అంతేకాదు.. ఈ ఘతనతను కోహ్లీ కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -